![manchu22](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/rtv/media/media_files/2024/12/17/wwQqW1Sc5vT3kIQQuGat.jpg)
తమ కుటుంబంలో జరుగుతున్న గొడవలపై మోహన్ బాబు భార్య నిర్మల తొలిసారి స్పందించారు. ఆదివారం నాడు మంచు మనోజ్ ఇంట్లో విష్ణు గొడవ చేసినట్లు వస్తోన్న వార్తలపై ఆమె క్లారిటీ ఇస్తూ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌కు లేఖ రాశారు. అందులో ఆ రోజు విష్ణు ఎలాంటి గొడవ చేయలేదని పేర్కొన్నారు.
Also Read : అల్లు అర్జున్ కోసం హైదరాబాద్ వస్తున్న పవన్..!
డిసెంబర్ 14న నా పుట్టినరోజు సందర్భంగా విష్ణు జల్‌పల్లిలోని మా ఇంటికి కేకు తీసుకొచ్చి సెలబ్రేట్ చేశాడు. అయితే ఈ విషయంపై మంచు మనోజ్.. విష్ణు మీద అభాండాలు వేసి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినట్లు తెలిసింది. విష్ణు ఆ రోజు ఎలాంటి గొడవ చేయలేదు. ఇంటికి వచ్చి తన గదిలోని వస్తువులు తీసుకుని కొద్దిసేపు నాతో మాట్లాడి వెళ్లిపోయాడు.
ఈ ఇంటిపై మనోజ్‌కు ఎంత హక్కు ఉందో.. పెద్ద కుమారుడు విష్ణుకీ అంతే హక్కు ఉంది. విష్ణు నా పుట్టినరోజు నాడు మనుషులతో ఇంట్లోకి రాలేదు. మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు. ఈ ఇంట్లో పనిచేస్తున్న వాళ్లు కూడా ‘మేమిక్కడ పనిచేయలేమని’.. వాళ్లే మానేశారు. ఇందులో విష్ణు ప్రమేయం లేదు..' అని నిర్మల లేఖలో పేర్కొన్నారు.
Also Read : మరోసారి షూటింగ్ లో గాయపడ్డ ప్రభాస్..!
Also Read: బాబూ పక్కకెళ్లి ఆడుకోమ్మా.. గజరాజు మర్యాద చూడండి
Also Read: శీతాకాలంలో ఈ కూరగాయతో ఎంతో ఆరోగ్యం