తిరుమల శ్రీవారిని భక్తులు భారీ సంఖ్యలో దర్శించుకుంటారు. శ్రీవారి దర్శించుకునేందుకు భక్తుల సౌకర్యం కోసం ఆర్జిత సేవా టికెట్ల కోటాను టీడీడీ రేపు విడుదల చేయనుంది. వచ్చే ఏడాది 2025 మార్చి నెలకి సంబంధించిన సుప్రభాతం, తోమాల, అష్టదళపాద పద్మారాధన సేవల కోసం రేపు ఉదయం 10 గంటలకు టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తోంది. ఇది కూడా చూడండి: నా రికార్డ్‌లు కావాలంటే గూగుల్‌లో వెతకండి– బుమ్రా వర్చువల్ సేవా టికెట్లు.. అలాగే లక్కీడీప్ డేటా కోసం ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవ టికెట్లను ఈ నెల 21వ తేదీ ఉదయం పది గంటలకు విడుదల చేయనున్నారు. అదే వర్చువల్ సేవా టికెట్లను కూడా అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు బుక్ చేసుకోవచ్చు. ఇది కూడా చూడండి: ట్రూడోకు షాక్.. ఉప ప్రధాని రాజీనామా దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్లు.. డిసెంబర్ 23వ తేదీన ఉదయం పది గంటలకు అంగ ప్రదక్షిణం, 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం, 3 గంటలకు వృద్ధులు, దీర్ఘకాలికంగా బాధపడుతున్న వ్యాధిగ్రస్తులు, దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్ల కోటా విడుదల చేయనున్నారు. ఇది కూడా చూడండి: తానుపారిపోవాలని అనుకోలేదు.. మొదటిసారి స్పందించిన అసద్ టీటీడీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి.. డిసెంబర్ 24వ తేదీన ఉదయం 10 గంటలకు వచ్చే ఏడాది మార్చి ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్ల కోటాను విడుదల చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు తిరుపతి, తిరుమలలో అద్దె గదుల బుకింగ్‌ను విడుదల చేయనున్నారు. ఈ నెల 27వ తేదీన శ్రీవారి సేవ కోటా విడుదల చేస్తారు. ఇవన్ని కూడా టీటీడీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి బుక్ చేసుకోవాలి. ఇది కూడా చూడండి: ప్రభుత్వ ఉద్యోగులకు రైతు భరోసా.. రేవంత్ సర్కార్ కీలక అప్డేట్!