విషాదం.. యువ రైతు ప్రాణం తీసిన అప్పులు
అప్పులు తీర్చలేక ఓ యువ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మంలో చోటుచేసుకుంది. వ్యవసాయం కోసం ట్రాక్టర్ తీసుకోవడం, కుటుంబ ఖర్చులతో అప్పు పెరిగిపోయింది. దీంతో అప్పు తీర్చలేనని ఆవేదన చెంది యువ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.