Ration Cards: రేషన్ వినియోగదారులకు బిగ్ షాక్.. సెప్టెంబర్ 1 నుంచి రేషన్ షాపులు బంద్.. కారణం ఇదే!

డీలర్ల బకాయిల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని, వెంటనే ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలని రేషన్ డీలర్లు అన్నారు. లేకపోతే సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపులను మూసివేస్తామని హెచ్చరించారు.

New Update
ration

ration

తెలంగాణ(Telangana) లో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రేషన్ షాపులు బంద్(Ration Shops Bandh) కానున్నాయి. దీనికి ముఖ్యం కారణం ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు ఐదు నెలల నుంచి రాకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి. కమిషన్ డబ్బులు, రేషన్ పంపిణీకి ఉపయోగించే బ్యాగులు ఇలా వాటి బిల్లులను చెల్లించడం లేదు. దుకాణాల అద్దెలు, సిబ్బంది జీతాలు అన్ని కూడా అప్పులు చేసి చెల్లించాల్సి వస్తుందని రేషన్ షాపులు వాపోతున్నారు. ఈ క్రమంలోనే రేషన్ షాపులు బంద్ చేసి ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నారు. రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు నాయికోటి రాజు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

ఇది కూడా చూడండి: CM Revanth Reddy : మేడిగడ్డ కూలింది. ఎల్లంపల్లే మనకు దిక్కు..సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

డీలర్ల బకాయిల విషయంలో నిర్లక్ష్యం వహిస్తుందని..

ప్రజలకు ఉచిత బియ్యం అందిస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది. కానీ డీలర్ల బకాయిల విషయంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు. వెంటనే ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలి అన్నారు. లేకపోతే సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపులను మూసివేస్తామని హెచ్చరించారు. ఆగస్టు 31లోగా బకాయిలు చెల్లించకపోతే ధర్నాలు మొదలు పెడతామని తెలిపారు. సెప్టెంబర్ 2న ఆర్డీవో కార్యాలయాల దగ్గర, 3న కలెక్టర్ కార్యాలయాల దగ్గర ధర్నాలు నిర్వహిస్తామని సంఘం ప్రకటించింది. అలాగే సెప్టెంబర్ 4న హైదరాబాద్‌లోని అసెంబ్లీ దగ్గర ధర్నా చేస్తామని తెలిపారు. 

ఇది కూడా చూడండి: Srisailam reservoir:  శ్రీశైలం జలాశయం వద్ద విరిగిపడ్డ కొండ చరియలు..అప్రమత్తమైన అధికారులు

అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ(Congress Party) రేషన్ డీలర్ల(Ration Dealers) బకాయిలను చెల్లించడంతో పాటు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను కూడా అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది. డీలర్లకు ప్రతీ నెల గౌరవ వేతనంగా రూ.5 వేలు ఇవ్వాలని తెలిపింది. అలాగే ప్రస్తుతం క్వింటాల్‌కు రూ.140గా ఉన్న కమీషన్‌ను రూ.300కు పెంచాలని కోరింది. రేషన్ డీలర్లకు ప్రతి నెలా సుమారు రూ. 25 కోట్ల కమిషన్ బకాయిలు ఆగిపోయాయని తెలిపింది. ఐదు నెలలు కలిపి మొత్తం రూ.125 కోట్లకు బకాయిలు చేరాయని రేషన్ డీలర్ల సంఘం తెలిపింది. అలాగే రేషన్ షాపులను కేవలం బియ్యం పంపిణీ కేంద్రాలుగా మాత్రమే కాకుండా మినీ సూపర్ మార్కెట్‌లుగా గుర్తించి నిత్యావసర వస్తువులను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. 

Advertisment
తాజా కథనాలు