Ram Chandra Rao: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచందర్‌ రావు

తెలంగాణ బీజీపీ అధ్యక్షుడు ఎవరు అనేది తేలిపోయింది. మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు ఈ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన్ని నామినేషన్ వేయాలని పార్టీ అధిష్ఠానం ఆదేశించింది.

New Update
Ram Chandra rao

Ram Chandra rao

Ram Chandra Rao:

తెలంగాణ బీజీపీ అధ్యక్షుడు ఎవరు అనేది తేలిపోయింది. మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు ఈ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన్ని నామినేషన్ వేయాలని పార్టీ అధిష్ఠానం ఆదేశించింది. మధ్యాహ్నం 2 గంటలకు రామ్‌చందర్‌రావు ఒక్కరే నామినేషన్ దాఖలు చేయనున్నారు. దీంతో మొత్తానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పేరు ఖరారైపోయింది. 

Also Read: కేంద్రం కొత్త పథకం..  రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.5 లక్షల వరకు..!

ఇదిలాఉండగా రాష్ట్ర అధ్యక్షుడి పదవి ఎవరికి అప్పగించాలనే దానిపై బీజేపీ అగ్రనేతలు గత కొంతకాలంగా తీవ్ర కసరత్తులు చేశారు. ముందుగా ఈ పదవి కోసం ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, కె.లక్ష్మణ్‌, మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌ రావు పేర్లు బలంగా వినిపించాయి. వీళ్లల్లో ధర్మపురి అరివింద్ లేదా ఈటల రాజేందర్‌కు ఇచ్చే ఛాన్స్ ఉందనే ప్రచారం నడిచింది. కానీ ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యులతో పాటు పలువురు సీనియర్ నేతలు రామచందర్‌ రావు పేరును ప్రతిపాదించారు. ఈ క్రమంలోనే హైకమాండ్‌ రామచందర్‌ రావుకు అధ్యక్ష పగ్గాలు అప్పగించనుంది.

Also Read: దుర్మార్గ తండ్రి.. నాలుగేళ్ల కూతురు చాక్లెట్ అడిగిందని.. దారుణంగా!

మధ్యాహ్నం 2 గంటలకు రామచందర్‌ రావు నామినేషన్ దాఖలు చేయనున్నారు. అయితే అధ్యక్ష పదవిపై ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్‌ ఎక్కువగా ఆశలు పెట్టుకున్నప్పటికీ వాళ్లకి నిరాశే మిగిలింది. రామచందర్‌ రావు విద్యార్థి దశలో ఉన్నప్పుడు ABVPలో పనిచేశారు. సంఘ్‌ పరివార క్షేత్రాలతో ఆయనకు మంచి సంబంధం ఉంది. తెలంగాణలో మరికొన్ని రోజుల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హైకమాండ్ రాష్ట్ర అధ్యక్షుడి పేరు ఖరారు చేసింది. మరోవైపు ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పీవీఎన్‌ మాదవ్‌ను ఎంపిక చేశారు. ఆయన కూడా ఈరోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు. 

Also Read: DK Shiva Kumar: మరో 2 నెలల్లో కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ?

Advertisment
Advertisment
తాజా కథనాలు