TTD: టీటీడీలో కలకలం.. శ్రీ శ్రీనివాస కళార్చన పేరిట మోసం… టీటీడీ విజిలెన్స్ అదుపులో నిర్వాహకుడు ?
తిరుమలలో నృత్యకళాకారులతో కళార్చన, అరంగేట్రం కార్యక్రమాలు నిర్వహిస్తామంటూ ఒక నిర్వాహకుడు కళాకారుల నుంచి డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. తిరుమలలో ‘శ్రీ శ్రీనివాస కళార్చన’ కార్యక్రమం నిర్వహిస్తానని చెప్పి కళాకారులను మోసగించాడు.