Rain Alert : ఓరుగల్లులో వర్ష బీభత్సం...నీటమునిగిన కాలనీలు
వరంగల్ జిల్లాలో మంగళవారం కుండపోత వర్షం బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా వరంగల్ నగరంలో వర్షం దంచికొట్టింది. వరంగల్, హనుమకొండ, కాజీపేటల్లో భారీ వర్షం కురిసింది. సోమవారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో హనుమకొండ బస్టాండ్, చౌరస్తాలో నీరు నిలిచింది.