మోహన్‌బాబుకు 10 ఏళ్ల జైలుశిక్ష తప్పదా ? చట్టం ఏం చెబుతోంది..

జర్నలిస్టుపై దాడి చేసిన నేపథ్యంలో మంచు మోహన్‌బాబుపై ఇప్పటికే కేసు నమోదైంది. దీంతో ఆయనకు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సెక్షన్ 109 ప్రకారం పదేళ్ల వరకు జైలుశిక్ష, జరిమానా విధించే ఛాన్స్ ఉందని సమాచారం.

New Update
MOhan Babu3

సినినటుడు మంచు మోహన్‌ బాబు కుటంబ వివాదం తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. మంచు మనోజ్‌, తన అనుచరులతో కలిసి మోహన్‌బాబు ఇంటికి గేట్లు తోసుకుంటూ వేళ్లడం, ఆ తర్వాత మోహన్‌బాబు ఓ టీవీ జర్నలిస్టుపై దాడి చేయడం సంచలనం రేపింది. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అయితే జర్నలిస్టుపై దాడి జరిగిన నేపథ్యంలో ఇప్పటికే మోహన్‌బాబుపై కేసు నమోదైంది. 

జర్నలిస్టుపై దాడి జరిగినట్లు ఆధారాలు కూడా ఉండటంతో ఆయనకు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మోహన్‌బాబుపై పహాడీషరీప్ పోలీసులు ముందుగా హత్యాయత్నం కేసు పెట్టారు. భారత న్యాయ సంహిత (BNS)లోని 118 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత న్యాయ నిపుణుల నుంచి సలహా తీసుకున్న తర్వాత తాజాగా 109 సెక్షన్ కింద కేసును మార్చినట్లు తెలుస్తోంది. 

MOHAN BABU

Also Read: ఈ సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లు

118 సెక్షన్ ఏం చెబుతోంది

భారత న్యాయ సంహిత 2023లోని 118 సెక్షన్ ప్రకారం.. ఎవరైనా ఎవరిపైనైనా దాడి చేసినా, గాయాలమయ్యేలా చేసినా, ప్రమాదకర ఆయుధాలు వాడినా కూడా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేస్తారు. ఇందుకు దాదాపు మూడేళ్ల జైలుశిక్ష లేదా  రూ.20 వేల జరిమానా పడే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి దాడి తీవ్రతను బట్టి రెండు శిక్షలు పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ గాయం తీవ్రమైతే జీవిత ఖైదు కూడా విధించే ఛాన్స్ ఉంటుంది.  

109 సెక్షన్ ఏం చెబుతోంది 

భారత న్యాయ సంహిత 2023లోని 109 సెక్షన్ ప్రకారం.. ఎవరినైనా హత్య చేయాలనే ఉద్దేశంతో దాడి చేసినప్పుడు ఈ సెక్షన్ కింద ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేస్తారు. దీని ప్రకారం నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా ఉంటుంది. హత్యాయత్నం చేసేటప్పుడు బాధితులకు గాయాలైతే శిక్ష కఠినంగా ఉంటుంది. జీవిత ఖైదు కూడా పడుతుంది. ఒక్కోసారి మరణశిక్ష కూడా పడే ఛాన్స్ ఉంటుంది.   

జర్నలిస్టులను బెదిరించినా, తిట్టినా జైలుశిక్షే

మరోవైపు వర్కింగ్ జర్నలిస్టులను బెదిరించినా, తిట్టినా లేదా కొట్టినా రూ.50 వేల జరిమానా లేదా ఐదేళ్ల కఠిన కారాగార శిక్షకు అర్హులవుతారని ఇటీవలే సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఓ కేసు విచారణ సందర్భంగా అత్యు్న్నత న్యాయస్థానం ఈ సంచలన తీర్పును వెల్లడించింది. దీనివల్ల జర్నలిస్టులు తమ వృత్తిపరంగా ఎలాంటి భయం లేకుండా ప్రజలకు వాస్తవమైన సమాచారాన్ని అందించే అవకాశం ఉంటుందని జర్నలిస్టు సంఘాలు ఈ తీర్పును స్వాగతించాయి. అయితే మోహన్‌బాబుకు దీనిప్రకారం కూడా శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది.   

Also Read: ఏటీఎం ద్వారా పీఎఫ్ విత్ డ్రా..కేంద్రం ఏర్పాట్లు

జర్నలిస్టుపై దాడి చేసిన ఘటనపై మంచు విష్ణు బుధవారం స్పందించారు. మోహన్‌బాబు కావాలని ఈ దాడి చేయలేదని.. కోపంలో అనుకోకుండా అలా జరిగిపోయిందంటూ చెప్పుకొచ్చారు. ఇదిలాఉండగా.. ఈ దాడి జరిగిన అనంతరం మోహన్‌బాబు గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చేరారు. ఆయనకు బీపీ, హైటెన్షన్, గుండె కొట్టుకునే వేగం తగ్గడం, అలాగే కంటి వాపు సమస్యలు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. రెండ్రోజుల పాటు ఆయనకు చికిత్స చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. మరోవైపు మోహన్‌బాబును అరెస్టు చేయాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే గురువారం మోహన్‌బాబు ఆస్పత్రి నుంచి ప్రెస్‌మీట్‌ పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు