వచ్చే ఏడాది రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మహిళలకు శుభవార్త తెలిపారు. ఆప్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే మహిళలకు ప్రతీ నెలా రూ.2,100 ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. आज हमारी सरकार ने दिल्ली की हर महिला को हज़ार रुपए देने की योजना शुरु कर दी है।चुनाव के बाद हम दिल्ली की हमारी सभी माताओं-बहनों को हर महीने 2100 रुपए उनके अकाउंट में देंगे। https://t.co/1KX72pLNDC pic.twitter.com/kOb4mwJngd — Arvind Kejriwal (@ArvindKejriwal) December 12, 2024 ఇది కూడా చూడండి: 8 మంది ఉన్నా.. బీజేపీపై ఎమ్మెల్సీ కవిత ఉగ్రరూపం! రేపటి నుంచే దరఖాస్తుల స్వీకరణ.. ఇంకో పది రోజుల్లో ఎన్నికల తేదీలు ప్రకటించే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే అరవింద్ కేజ్రీవాల్ మహిళలకు ఈ ఆర్థిక సాయం ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. మొదట నెలకు కేవలం రూ.1000 మాత్రమే ఇవ్వాలని అనుకున్నారు. కానీ ఈ డబ్బు సరిపోదని కొందరు అనడంతో నెలకు రూ.2100 ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు. దీనికి రేపటి నుంచే దరఖాస్తులు స్వీకరించనున్నట్లు అరవింద్ తెలిపారు. ఇది కూడా చూడండి: US: ట్రంప్ బాధ్యతలు చేపట్టకముందే రాజీనామా చేస్తా: ఎఫ్‌బీఐ డైరెక్టర్! ఇదిలా ఉండగా.. కేజ్రీవాల్ ఇవే కాకుండా మరికొన్ని హామీలను ఇటీవల ప్రకటించారు. ఢిల్లీలోని ఆటో డ్రైవర్లకు రూ.10 లక్షల వరకు లైఫ్ ఇన్సూరెన్స్ ఇస్తామని అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల ప్రకటించారు. అలాగే రూ.5 లక్షల వరకు ప్రమాద బీమా అందిస్తామన తెలిపారు. దీంతో పాటు డ్రైవర్ల కుమార్తెల పెళ్లిళ్లకు రూ.లక్ష ఆర్థికసాయం అందించడంతో పాటు ఆటో డ్రైవర్లకు యూనిఫాం అలవెన్స్ కింద ఏడాదికి రెండుసార్లు రూ.2,500 చొప్పున ఇస్తామని హామీలు ఇచ్చారు. ఇది కూడా చూడండి: BIT Coin: 24 గంటల్లో 3.82 లక్షల ప్రాఫిట్ ఇది కూడా చూడండి: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల లిస్ట్ రెడీ!