ఇంకోసారి అలా రాస్తే ఊరుకునేది లేదు.. సాయి పల్లవి స్ట్రాంగ్ వార్నింగ్

నటి సాయి పల్లవి 'రామాయణం' సినిమా కోసం శాకాహారిగా మారారు అంటూ వస్తున్న రూమర్ల పై ఆమె ఘాటుగా స్పందించారు. ''మౌనంగా ఉన్నానని ఇష్టం వచ్చింది రాస్తే ఊరుకునేది లేదు.. ఇంకోసారి నిరాధారమైన వార్తలు ప్రచురిస్తే ఎవరైనా సరే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

New Update

Sai Pallavi:  ''మౌనంగా ఉన్నానని ఇష్టం వచ్చింది రాస్తే ఊరుకునేది లేదు.. ఇంకోసారి నిరాధారమైన వార్తలు ప్రచురిస్తే ఎవరైనా సరే చర్యలు తీవ్రంగా ఉంటాయి'' అంటూ  నటి సాయి పల్లవి సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఎప్పుడు ప్రశాంతంగా, చిరునవ్వుతో, ఎంతో సింపుల్ గా కనిపించే సాయి పల్లవి ఇంతలా మండిపడడానికి కారణమేంటి..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. 

సోషల్ మీడియాలో రూమర్స్ 

సాయి పల్లవి ప్రస్తుతం బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'రామాయణం' సినిమా చేస్తుంది. ఇందులో సాయి పల్లవి సీత పాత్రను పోషిస్తుంది. అయితే ఈ సినిమాలో సీత పాత్ర కోసం ఆమె శాకాహారిగా మారిందని, తన అలవాట్లను కూడా మార్చుకున్నారని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. కాగా, ఈ వార్తలపై సాయి పల్లవి ఘాటుగా స్పందించింది. ఇలాంటి నిరాధారమైన వార్తలు రాస్తే న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. 

Also Read: మంచు ఫ్యామిలీ వివాదాలకు సౌందర్యతో లింక్.. అసలు విషయం తెలిస్తే షాక్!

సాయి పల్లవి పోస్ట్.. 

నా  పై ఇప్పటివరకు ఎన్నో సార్లు రూమర్స్ వచ్చాయి. అలా వచ్చిన ప్రతిసారి నేను మౌనంగానే ఉన్నాను. ఎందుకంటే నిజమేంటి అనేది దేవుడికి తెలుసు.. కానీ, నేను మౌనంగా ఉంటున్నానని రూమర్స్  రాసేస్తున్నారు. ఇక ఇప్పుడు స్పందించాల్సిన టైమ్ వచ్చింది. నా కెరీర్, సినిమాలకు సంబంధించి ఏవైనా నిరాధారమైన వార్తలు ప్రచురిస్తే ఇక సహించను. అది గుర్తింపు పొందిన మీడియా అయిన సరే చట్టపరమైన చర్యలు తీసుకుంటాను. ఇన్నాళ్లు సహించాను.. ఇకపై ఇలాంటి చెత్త కథనాలు భరించడానికి సిద్ధంగా లేను అంటూ తనపై వస్తున్న రూమర్లను తీవ్రంగా ఖండించింది సాయి పల్లవి. 

బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారీ  'రామాయణం' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో రణ్ బీర్ కపూర్ రాముడిగా నటిస్తున్నారు. మూవీ విడుదల తేదీలను ప్రకటించారు.  ఈ మూవీ మొదటి భాగం 2026 దీపావళికి విడుదల చేయగా,  సెకండ్ పార్ట్ 2027 దీపావళికి విడుదల కానున్నట్లు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు. 

Also Read: రచ్చ లేపుతున్న మంచు ఫ్యామిలీ ఫైట్‌.. ముంబై పారిపోయిన మంచు లక్ష్మి!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు