/rtv/media/media_files/2025/08/10/sangareddy-pregnent-lady-2025-08-10-16-50-46.jpg)
Sangareddy pregnent lady
Sangareddy: స్వాతంత్య్రభారతానికి 75 ఏళ్లు నిండాయి. ఇన్నేండ్లలో దేశాన్ని ఎన్నో ప్రభుత్వాలు పాలించాయి. దేశం అభివృద్ధిలో దూసుకుపోతుందని ప్రపంచ వేదికల మీద ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం తప్ప దేశానికి ఆ పాలకులు చేసిన మేలంటూ ఏదీ లేదు. నాయకులు కోట్లకు అభివృద్ధి చెందారే తప్ప పేదలు పేదలుగానే మిగిలిపోయారు. ఈ దేశంలో నేటికి వేలాది గ్రామాలకు కనీస సౌకర్యాలు లేవంటే మనమెంత పురోగమిస్తున్నామో అర్థం చేసుకోవచ్చు. నేటికి అనేక గ్రామాలకు రోడ్డు, విద్యుత్, తాగునీరు సౌకర్యాలు లేవన్నది జగమెరిగిన సత్యం. నేటికి అనేక గిరిజన గ్రామాల ప్రజలు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి వాగులు దాటుతున్నారంటే మనదేశం ఏ స్థితిలో ఉందో అంచనా వేయవచ్చు.
ఇది కూడా చూడండి:Palnadu Ragging: పల్నాడు లో ర్యాగింగ్ కలకలం.. కర్రలతో కొడుతూ.. కరెంట్ షాక్ పెడుతూ! వీడియో వైరల్
దేశానికి స్వాతంత్య్రమే కాదు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి కూడ పదేండ్లు దాటింది. అయినా నేటికి అనేక గ్రామాలకు మౌళిక వసతులు లేవన్నది నిజం. నేటికి కొన్ని గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాలకు రోడ్లు లేకపోవడం అనేది నేటి మన పాలకుల ఘనమైన పాలనకు అద్ధం పడుతోంది. అనేక గిరిజన ప్రాంతాల్లో నేటికి రోడ్డు సౌకర్యం లేదు. అనేక గిరిజన గ్రామాల్లో ఇప్పటికీ రోడ్డు సౌకర్యాలు లేక ఆ గిరిజనులు పడుతున్న నరకయాతన వర్ణనాతీతం.
ఇది కూడా చూడండి:Shrishti Fertility Center: సృష్టి కేసులో ఈడీ రంగ ప్రవేశం.. భారీగా నిధులు తరలింపుపై అనుమానాలు
కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం లోనూ అలాంటి గ్రామాలున్నాయంటే అతిశయోక్తి కాదు. తెలంగాణ రాష్ట్రంలో అలాంటి ఓ తండా వెలుగులోకి వచ్చింది. సంగారెడ్డి జిల్లా నాగల్ గిద్ద మండలంలో మున్యా నాయక్ తండా ఒకటి. పేరుకే గ్రామం కానీ, ఆ తండాలోకి వెళ్లడానికి సరైన రోడ్డు సౌకర్యం కూడా లేదు. దీంతో ఈ రోజు ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఒక యువతి గర్భం దాల్చింది. అయితే ఆమెకు డెలివరీ సమయం వచ్చి నొప్పులు పడుతుంది. అయితే తండాలోకి అంబులెన్స్ వెళ్లేందుకు కూడా సరైన రోడ్డు మార్గం లేక గర్భిణీ అష్ట కష్టాలు పడింది.. ఆశా కార్యకర్తల సహాయంతో 2 కిలోమీటర్ల వరకు గర్భిణీని కుటుంబ సభ్యులు వీపుపై మోసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఆమె సుమారు గంట పాటు నరకయాతన అనుభవించింది. అయితే ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలోనే మార్గ మధ్యలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం అంబులెన్స్ లో నారాయణఖేడ్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. సకాలంలో ఆమెను ఆస్పత్రికి తరలించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే తండాకు రోడ్డు వేయాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని గ్రామస్థుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: తీసుకున్న సొంత గొయ్యిలో పడ్డ పాకిస్తాన్.. 2 నెలల్లో రూ.1,240 కోట్లు నష్టం
Also Read: అమెరికా పతనం మొదలైంది..సుంకాల తర్వాత వాల్ మార్ట్ లో ధరల పెరుగుదల