ఖమ్మంలో కన్నీరు పెట్టించే ఘటన.. గ్రూప్-3 ఎగ్జామ్ రాసి వస్తున్న తల్లి వైపు పరిగెత్తుతూ..! గ్రూప్-3 పరీక్ష రాసి వస్తున్న తల్లిని చూసిన చిన్నారి అమ్మొచ్చిందంటూ సంబరపడింది. తల్లిని హత్తుకునేందుకు గుమ్మం వైపు పరుగు తీసింది. కానీ అమ్మను చేరక ముందే ఆ బిడ్డ గుండెపోటుతో కుప్ప కూలింది. ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. By Vijaya Nimma 19 Nov 2024 in తెలంగాణ క్రైం New Update Khammam షేర్ చేయండి TG Crime: ఖమ్మం జిల్లా గ్రామీణ మండల పరిధిలో విషాద కర ఘటన చోటుచేసుకుంది. ఎంవీపాలెం గ్రామానికి లావణ్య సోమవారం గ్రూప్ 3 పరీక్ష రాసేందుకు వెళ్లింది. పరీక్ష రాసి వెళ్లిన తల్లి తిరిగి ఇంటికి రావడం చూసిన చిన్నారి అమ్మొచ్చిందంటూ సంబరపడింది. తల్లిని హత్తుకునేందుకు ఇంటి గుమ్మం వైపు పరుగు తీసింది. ఆమె కుడా రా..రా.. అంటూ కూతుర్ని చూస్తూ చేతులు చాచింది. అమ్మను చేరక ముందే ఆ బిడ్డ ఒక్కసారిగా కుప్పకూలింది. ఇది కూడా చదవండి: నిమ్మకాయను ఇలా వాడితే అజీర్తి సమస్య ఉండదు ఒక్కసారిగా కుప్పకూలి క్షణాల్లో ప్రాణాలు.. తల్లిదండ్రులు కథనం ప్రకారం.. ఎంవీపాలెం గ్రామానికి చెందిన కుర్ర వినోద్, లావణ్య దంపతులు ఖమ్మంలో నివాసం ఉంటున్నారు. వారికి ఏకైక కుమార్తె ప్రహర్షిక (4) ఉంది. సోమవారం తల్లి లావణ్య గ్రూప్-3 పరీక్ష రాసేందుకు వెళ్తుండగా.. చిన్నారి నానమ్మ, తాతయ్యల దగ్గర వదిలి వెళ్లింది. పాప వాళ్ల దగ్గరే ఆడుకుంటూ ఉంది. పరీక్ష రాసి మధ్యాహ్నం ఇంటి వస్తున్న తల్లిని చూసి చిన్నారి ఒక్కసారిగా అమ్మ ఒడికి చేరాలని పరుగు పెట్టింది. ఇంతలో ఏమైందో గాని.. ఒక్కసారిగా చిన్నారి కిందపడిపోయింది. Also Read: హైడ్రా మరో కీలక నిర్ణయం.. ఈసారి ఆ సంస్థతో కలిసి తల్లిదండ్రులు కంగారుతో ఏమైందని అడిగితే.. ఛాతీ దగ్గర నొప్పి వస్తోందని చెప్పి అపస్మారక స్థితికి వెళ్లింది. వెంటనే ఆర్‌ఎంపీ డాక్టర్ దగ్గరకు ప్రాథమిక వైద్యం చేయించి.. ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన డాక్టర్లలు అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు తెలిపారు. అయితే.. చిన్నారి గుండెపోటుతో మృతిచెంది ఉండొచ్చని డాక్టర్లు భావిస్తున్నారు. ఎప్పుడూ చలాకీగా ఆడుతూ ఉండే బిడ్డ ఉన్నట్లుండి విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఇది కూడా చదవండి: నిజామాబాద్‌లో హైటెన్షన్.. మేయర్ భర్తపై సుత్తెతో దాడి! Also Read: Rahul Gandhi: కులగణనపై రాహుల్‌గాంధీ మరోసారి సంచలన వ్యాఖ్యలు #khammam #group 3 exams #heart-attack #ts-crime మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి