Rahul Gandhi: కులగణనపై రాహుల్‌గాంధీ మరోసారి సంచలన వ్యాఖ్యలు దేశంలో వివిధ సంస్థలు, న్యాయ వ్యవస్థలు, ప్రైవేటు కంపెనీల్లో.. ఎస్సీలు, ఓబీసీలు, ఆదివాసీల ప్రాతినిధ్యాన్ని తెలుసుకునేందుకే కాంగ్రెస్ కులగణన చేపట్టిందని రాహుల్‌గాంధీ మరోసారి స్పష్టం చేశారు. ప్రధాని మోదీని రిజర్వేషన్లు పెంచాలని అడిగితే స్పందించలేదన్నారు. By B Aravind 18 Nov 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి Rahul Gandhi - Caste Census కులగణనపై రాహుల్‌గాంధీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో వివిధ సంస్థలు, న్యాయ వ్యవస్థలు, ప్రైవేటు కంపెనీల్లో.. ఎస్సీలు, ఓబీసీలు, ఆదివాసీల ప్రాతినిధ్యాన్ని తెలుసుకునేందుకే కాంగ్రెస్ కులగణన చేపట్టిందని మరోసారి స్పష్టం చేశారు. ఝార్ఖండ్‌లో ఎన్నికల ప్రచారం నేటితో ముగియనున్న వేళ రాంచీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికలను ఇండియా కూటమి, బీజేపీ ఆర్‌ఎస్సెస్ మధ్య భావజాల పోరాటమన్నారు. కాంగ్రెస్ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తుంటే.. వాళ్లు మాత్రం దీన్ని అణిచివేస్తున్నారని ఆరోపించారు. Also Read: మణిపుర్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. అమిత్ షా కీలక నిర్ణయం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ప్రధాని మోదీ తనపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండియా కూటమి రిజర్వేషన్లను పెంచాలని.. 50 శాతం పరిమితిని తొలగించాలని కోరుకుంటోందని అన్నారు. దేశంలో కులగణన చేపట్టాలని, రిజర్వేషన్లు పెంచాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేసినా కూడా ఆయన ఏమాత్రం స్పందించలేదని విమర్శలు చేశారు. రిజర్వేషన్లు పెంచడానికి, కులగణన ప్రక్రియకు బీజేపీ వ్యతిరేకమంటూ ఆరోపణలు చేశారు. Also Read: డేంజర్ జోన్‌లో దేశ రాజధాని.. తాత్కాలికంగా స్కూళ్లు, కాలేజీలు బంద్ కొద్దిమంది బిలియనీర్లకు మాత్రమే దేశ సంపదను అప్పగిస్తున్నారని ఆరోపించారు. రూ.లక్ష కోట్ల విలువైన ధారవి భూమిని వ్యాపారవేత్తలకు ఇవ్వాలని బీజేపీ చూస్తోందని ధ్వజమెత్తారు. పేదల కోసం తాము ప్రభుత్వాన్ని నడపాలని కోరుకుంటున్నామని.. బిలియనీర్ల కోసం కాదని అన్నారు. అలాగే ఝార్ఖండ్‌లో గనులు, అడవులు, భూములను పెట్టుబడిదారులకు అప్పగిస్తున్నారంటూ విమర్శించారు. బొగ్గుకు సంబంధించి రూ.1.36 లక్షల కోట్ల బకాయిలు ఉన్నా కూడా వాటిని విడుదల చేయడం లేదని విరుచుకుపడ్డారు. బీజేపీ ఆదివాసి వ్యతిరేకి అని, సీఎం హేమంత్ సోరెన్‌ను కూడా తప్పుడు కేసులతో అరెస్టు చేసి భయపెట్టాలని చూశారని ఆరోపణలు చేశారు. ఇదిలాఉండగా.. ప్రస్తుతం తెలంగాణలో కులగణన జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల బీహార్ ప్రభుత్వం కూడా కులగణన చేపట్టి కులాల వారిగా ఎంతమంది ఉన్నారు అనే వివరాలను వెల్లడించిన సంగతి తెలిసిందే Also Read: వార్తా సంస్థలకు సోషల్ మీడియా సంస్థలు డబ్బులు చెల్లించాల్సిందే: అశ్వినీ వైష్ణవ్ Also Read : లగచర్ల ఘటన మణిపుర్ కన్నా తక్కువ కాదు.. రాహుల్‌పై కేటీఆర్ ఫైర్ #national-news #rahul-gandhi #caste-census మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి