హైడ్రా మరో కీలక నిర్ణయం.. ఈసారి ఆ సంస్థతో కలిసి

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షించడమే కాకుండా కాలుష్యం భారి నుంచి రక్షించేందుకు కూడా హైడ్రా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే కాలుష్య నియంత్రణ మండలి (PCB)తో కలిసి పనిచేసేందుకు సిద్ధమవుతోంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
hydra 2

హైదరాబాద్‌లో చెరువులను పరిరక్షణకు హైడ్రా ముందుకు వెళ్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వాటి పరిరక్షించడమే కాకుండా కాలుష్యం భారి నుంచి రక్షించేందుకు కూడా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే కాలుష్య నియంత్రణ మండలి (PCB)తో కలిసి పనిచేసేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే హైడ్రా కమిషనర్ రంగనాథ్.. పీసీబీ కార్యాలయంలో పీసీబీ మెంబర్ సెక్రటరీ జి.రవితో సమావేశమయ్యారు. 

Also Read: ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం..107 విమాన సర్వీసులు ఆలస్యం!

హైదరాబాద్‌లో కాలువలు, చెరువుల్లోకి మురుగు నీరుతో పాటు పారిశ్రామిక వ్యర్థాలు రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అలాగే పారిశ్రామిక వ్యర్థాలు డంప్‌ చేయకుండా రెండు విభాగాల సిబ్బందితో గట్టిగా నిఘా పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు చెరువులు, కాలువల్లో కలిసే పారిశ్రామిక వ్యర్థాలు ఏ కంపెనీవనేది గుర్తించేందుకు కూడా ప్రత్యేక వ్యవస్థను అభివృద్ధి చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.   

Also Read: డేంజర్ జోన్‌లో దేశ రాజధాని.. తాత్కాలికంగా స్కూళ్లు, కాలేజీలు బంద్

మరికొన్నిరోజుల్లోనే పారిశ్రామిక వర్గాలతో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. నగరంలో పీసీబీ నిబంధనలు పాటించేలా అవగాహన కల్పించనున్నారు. అలాగే నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  స్థానికులతో పాటుగా పర్యావరణవేత్తలు, విద్యార్థులతో చెరువుల కమిటీల పరిరక్షణ కమిటీలు ఏర్పాటు చేసి వాళ్ల భాగస్వామ్యంతో కాలుష్యాన్ని నియంత్రిస్తామని రంగనాథ్‌ స్పష్టం చేశారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు