/rtv/media/media_files/2025/04/30/8WnTAYfhaG9BHTqeLT4f.jpg)
Police Station
తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని పలు పోలీస్‌స్టేషన్లు, డివిజన్ల పేర్లను మార్చింది. ఈ మేరకు నగర కమిషనర్ సీవీ ఆనంద్ ఈ విషయాన్ని వెల్లడించారు. నగరంలో ప్రఖ్యాత ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని పలు పోలీస్‌స్టేషన్లు, డివిజన్ల పేర్లను మార్చున్నట్లు పేర్కొన్నారు. టౌలిచౌకి పీఎస్‌ను 72వ లా అండ్ ఆర్డర్ పీఎస్‌గా, సెక్రటేరియట్ పీఎస్‌ను లేక్ పోలీస్ స్టేషన్‌గా మార్చినట్లు తెలిపారు.
Also Read: మోదీ కుల గణన నిర్ణయంపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు..
అలాగే హుమాయున్‌నగర్ పీఎస్‌ను మెహదీపట్నం పీఎస్‌గా, షాహినాయత్‌గంజ్ పీఎస్‌ను గోషామహల్ పోలీస్ స్టేషన్‌గా మార్చినట్లు పేర్కొన్నారు. '' 35 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ కమిషనరేట్ ఠాణాల పునర్‌వ్యవస్థీకరణ జరిగింది. హైదరాబాద్‌లో 71 లా అండ్ ఆర్డర్ అలాగే 31 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. గత రెండేళ్లుగా పోలీస్ స్టేషన్ల హద్దుల్లో సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా ట్రాఫిక్, లా అండ్ ఆర్టర్ ఠాణాపై పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయి. ప్రభుత్వానికి రిపోర్టు పంపితే పేర్ల మార్పునకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. హైదరాబాద్ సిటీ పోలీస్ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామన్నారు.
Also Read: కర్రెగుట్టను స్వాధీనం చేసుకున్న బలగాలు.. జాతీయ జెండా ఎగురవేసి సంబరాలు
ఇదిలాఉండగా.. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కూడా భారీ ప్రక్షాళన చేపట్టారు. పెద్ద ఎత్తున సీఐలను ట్రాన్స్‌ఫర్ చేశారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 146 మంది సీఐలను బదిలీ చేస్తూ సీపీ ఉత్తర్వులు ఇచ్చారు.
Also Read: భారత్ పీవోకేను స్వాధీనం చేసుకోవాలి.. బ్రిటన్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
telugu-news | rtv-news | telangana