POK: భారత్ పీవోకేను స్వాధీనం చేసుకోవాలి.. బ్రిటన్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

పహల్గాం ఉగ్రదాడిపై భారత సంతతికి చెందిన బ్రిటిష్ ఎంపీ లార్డ్ మేఘనాథ్ దేశాయ్ స్పందించారు. కశ్మీర్‌ వివాదానికి స్వస్తి పలకాలంటే భారత్‌ పీవోకేను పూర్తిగా స్వాధీనం చేసుకోవలన్నారు. ఇదే అన్ని సమస్యలకు పరిష్కారం అవుతుందని పేర్కొన్నారు.

New Update
Taking back POK only solution, Says India-born British MP on Pahalgam Attack

Taking back POK only solution, Says India-born British MP on Pahalgam Attack

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ మధ్య ఎప్పుడు ఏం జరుగుంతో అనే టెన్షన్ నెలకొంది. ఏ క్షణమైనా పాకిస్థాన్‌పై భారత్‌ దాడులు చేయవచ్చనే ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే ఈ వివాదంపై భారత సంతతికి చెందిన బ్రిటిష్ ఎంపీ లార్డ్ మేఘనాథ్ దేశాయ్ స్పందించారు. కశ్మీర్‌ వివాదాన్ని పూర్తిగా అంతం చేయాలంటే పాక్ ఆక్రమిత కశ్మీర్‌ (POK)ను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలంటూ సూచనలు చేశారు. ఇదే అన్ని సమస్యలకు పరిష్కారం అవుతుందని పేర్కొన్నారు. 

ఉగ్రవాదులను శిక్షించేందుకు ఇలాంటి పరిస్థితులు మళ్లీ రాకుండా ఉండాలంటే ఈ విషయంలో భారత్ కఠినంగా సమాధానం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. పీఓకే ఎప్పటికీ ఇండియాదేనన్నారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి చాలా క్రూరమైనదని.. కశ్మీర్‌ వివాద వ్యవహారంలో ఈ ఘటనే చివరిది కావాలని అన్నారు. దీనిపై భారత ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకుంటుందని తాను నమ్ముతున్నానని పేర్కొన్నారు. 

Also Read: 'పాకిస్తాన్‌ జిందాబాద్'...సీఎం సిద్ధరామయ్య సంచలన కామెంట్స్!

ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని తాను నమ్ముతున్నానని అన్నారు. కశ్మీర్‌లో ఉన్న సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరిస్తానని ప్రధాని మోదీ పలుమార్లు చెప్పినట్లు పేర్కొన్నారు. మరోవైపు పహల్గాం ఉగ్రదాడికి బాధ్యులైన నేరస్థులను కఠినంగా శిక్షించాలని మేము భారత్‌ను కోరుతున్నామని బ్రిటన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపింది. ఉగ్రవాదాన్ని నిర్మూలించే విషయంలో తాము భారత్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటామని స్పష్టం చేసింది. 

Also Read: బరితెగించిన పాక్.. పహల్గామ్ ప్రధాన నిందితుడికి ప్రభుత్వ బలగాలతో సెక్యూరిటీ!

పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా లండన్‌ భారతీయులు నిరసనలు చేస్తే.. అక్కడున్న పాకస్థాన్ హైకమిషన్ అధికారి వాళ్లని బెదిరించిన వీడియో తమను ఆందోళనకు గురి చేసిందని తెలిపింది. ప్రస్తుతం దీనిపై విచారణ జరుపుతున్నామని.. ఇరు దేశాల మధ్య సంబంధాలు ఉన్నందున ఉద్రిక్తలు పెరగాలని కోరకోవడం లేదని పేర్కొంది. కశ్మీర్‌ ప్రజల నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకొని వాళ్ల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా భారత్-పాకిస్థాన్ బాధ్యత తీసుకోవాలని సూచనలు చేసింది. 

Also Read:దేశంలో కులగణన.. మోదీ సర్కార్ సంచలన ప్రకటన!

telugu-news | rtv-news | Pahalgam attack | national-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు