ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. బీఆర్ఎస్ నేతకు నోటీసులు!

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. జూబ్లీహిల్స్ ఏసీపీ ఆఫీస్ లో విచారణకు రావాలని ఆదేశించారు. అనారోగ్యం కారణంగా రాలేనని లింగయ్య చెప్పినట్లు సమాచారం.  

New Update
ddr

Phone Tapping Case: తెలుగురాష్ట్రాల్లో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. నిందితుడు తిరుపతన్నతో లింగయ్యకు ఫోన్ కాంటాక్ట్స్ ఉండటంతో విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. సోమవారం జూబ్లీహిల్స్ ఏసీపీ ఆఫీస్ లో విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. అయితే అనారోగ్యంగా కారణంగా విచారణకు హాజరు కాలేనని చిరుమర్తి లింగయ్య  పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో మరోసారి ఆయనకు నోటీసులు జారీ చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. 

 ఇది కూడా చూడండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు మృతి

సాక్షిగానా లేకపోతే నిందితుడిగానా..

అయితే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు జారీ కావడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఓ రాజకీయ నేతకు నోటీసులివ్వడం ఇదే తొలిసారి. కాగా తర్వాత ఎవరికి నోటీసులు అందబోతున్నాయనే అంశం హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి అనుచరునిగా ఉండే లింగయ్య తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇప్పుడు ఆయనకు సాక్షిగా నోటీసులు జారీ చేశారా లేకపోతే నిందితుడిగానా అన్నదానిపై క్లారిటీ రావాల్సివుంది. 

ఇది కూడా చదవండి: నీవు ఒక దొంగ.. తెలంగాణ నిన్ను మరిచిపోయింది: కేసీఆర్ కు రేవంత్ కౌంటర్

ఈ వ్యవహారంలో ఎలా జోక్యం చేసుకున్నారు..

ఇక ఫోన్ ట్యాపింగ్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగిందనే ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. కాగా ప్రభుత్వం మారగానే ట్యాపింగ్ చేసిన పరికరాలన్నీ ధ్వంసం చేశారని గుర్తించి కేసులు పెట్టారు. ఈ క్రమంలో అరెస్టు అయిన పోలీసు అధికారులు ఇంకా జైలులోనే ఉన్నారు. ఏ వన్ గా ఉన్నఇంటలిజెన్స్ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు అమెరికా వెళ్లిపోయారు. కేసు నమోదు కాక ముందే వైద్య చికిత్స కోసం వెళ్లిపోయిన ఆయన ఇప్పటి వరకూ తిరిగి రాలేదు. ఆయన కోసం పోలీసులు చాలా ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకపోయింది. అయితే ట్యాపింగ్ కేసులో చిరుమర్తి లింగయ్య పేరు ఎప్పుడూ బయటకు రాకపోగా కేసీఆర్, కేటీఆర్‌లతో పాటు పలువురు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. కానీ మాజీ ఎమ్మెల్యే లింగయ్య ఈ వ్యవహారంలో ఎలా జోక్యం చేసుకున్నారన్నది ఆసక్తికరంగా మారింది. 

ఇది కూడా చదవండి: రుషికొండ ఫైల్స్ మిస్సింగ్.. తలలు పట్టుకుంటున్న అధికారులు

ఇది కూడా చూడండి: దారుణం.. టీచర్లు బ్లాక్‌ మెయిల్ చేస్తూ నీట్ విద్యార్థిపై..

Advertisment
Advertisment
తాజా కథనాలు