Rushikonda: రుషికొండ ఫైల్స్ మిస్సింగ్.. తలలు పట్టుకుంటున్న అధికారులు

రుషికొండపై నిర్మించిన ప్యాలెస్‌ నిర్మాణానికి సంబంధించిన ఫైళ్లు ఒక్కొక్కటిగా మాయమవ్వడం కలకలం రేపుతోంది. ప్యాలెస్ నిర్మాణానికి అనుమతి ఫైళ్లు, అలాగే మరికొన్ని ముఖ్యమైన పేపర్లు దొరకడం లేదు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
rushikonda

Rushikonda 

విశాఖపట్నంలో రుషికొండ విధ్వంసం గతంలో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. కొండపై నిర్మించిన ప్యాలెస్‌ నిర్మాణానికి సంబంధించిన ఫైళ్లు ఒక్కొక్కటిగా మాయమవ్వడం కలకలం రేపుతోంది. ప్యాలెస్ నిర్మాణానికి పర్మిషన్ ఫైళ్లు, అలాగే మరికొన్ని ముఖ్యమైన పేపర్లు దొరకడం లేదు. అంతేకాదు కొండపై గతంలో రిసార్టును కూల్చేందుకు తీసుకున్న అనుమతుల ఫైళ్లు కూడా గల్లంతయ్యాయి. ఆ రిసార్టులో  80 గదులు ఉండేవి. అలాగే ఓ ఫంక్షన్ హాల్, బార్ అండ్ రెస్టారెంట్ ఉండేవి. వీటిలో ఉండాల్సిన దాదాపు రూ.50 కోట్లు విలువైన ఏసీలు, ఫ్రిజ్‌లు, ఇతర సామాగ్రి ఏమైందో తెలియడం లేదు. దీంతో ఏపీ టూరిజం డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీటీడీసీ) అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.    

Also Read: జగన్‌కు షాక్.. షర్మిళ అంత మాట అనేసిందేంటి!

ప్యాలెస్ నిర్మాణంలో భాగంగా రిసార్టును కూలగొట్టినప్పుడు అప్పటి అధికారులు ఈ సామాగ్రిని ఏం చేశారో అని చెప్పే ఫైల్‌ ఒక్కటి కూడా లేదు. ఈ ఫర్నిచర్‌ వివరాలు ఉన్న ఓ ప్రత్యేక ఫైల్ ఏపీటీడీసీ వద్ద ఉండేది. కానీ ఇప్పుడు అది కనిపించడం లేదు. ప్రభుత్వం మారిపోవడంతో ఆ ఫైల్ మాయమైనట్లు తెలుస్తోంది. వాస్తవానికి రూల్స్ ప్రకారం.. రిసార్ట్‌ను తొలగించేటప్పుడు అందులో సామాగ్రిని ఇతర రిసార్ట్‌లకు పంపించడం లేదా వాటికి తగిన ధరను నిర్ణయించడం, టెండర్ ద్వారా బయటి మార్కెట్‌లో విక్రయించడం లాంటి పనులు చేయాల్సి ఉంటుంది. కానీ రుషికొండ విషయంలో టూరిజం అధికారులు ఈ రూల్స్ పాటించలేదు.    

Also Read: నీవు ఒక దొంగ.. తెలంగాణ నిన్ను మరిచిపోయింది: కేసీఆర్ కు రేవంత్ కౌంటర్
 
ఇక రుషికొండపై మాజీ సీఎం జగన్‌ ఏకంగా రూ.500 కోట్ల ప్రజాధనంలో ప్యాలెస్‌ నిర్మాణం చేపట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఆ ప్యాలెస్‌ను ఏం చేయాలో తెలియక కూటమి నేతలు తలలు పట్టుకుంటున్నారు. అయితే రుషికొండ ప్యాలెస్‌ నిర్మాణానికి కీలకంగా వ్యవహరించిన మల్‌రెడ్డి 2019లో డిప్యుటేషన్‌పై తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు. అప్పట్లో ప్రభుత్వం ప్రత్యేక జీవోను జారీ చేసి ఆయన్ని రప్పించింది. అయితే ఏపీటీడీసీ అధికారులు మాత్రం టూరిజం సెక్రటరీ పర్మిషన్ లేకుండానే, జీవో ఇవ్వకుండానే ఆయన్ని రిలీవ్ చేశారు. 

Also Read: ఏపీ బడ్జెట్.. మెగా డీఎస్సీ, తల్లికి వందనంపై ఆర్థిక మంత్రి కీలక ప్రకటన!

 రుషికొండ ప్యాలెస్ నిర్మాణంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రమణ కూడా కీలక పాత్ర పోషించారు. ఇరిగేషన్‌ నుంచి ఆయన డిప్యుటేషన్‌పై ఏపీటీడీసీకి వచ్చారు. ప్యాలెస్ నిర్మాణాన్ని దగ్గరుండి కూడా చూసుకున్నారు. కార్పొరేషన్ అధికారులు ఆయన్ని విశాఖ డివిజనల్ మేనేజర్ పోస్టులో కూర్చోబెట్టడంతో పాటు టూరిజం శాఖ రీజినల్‌ డైరక్టర్‌గా కూడా బాధ్యతలు అప్పజెప్పారు. రుషికొండకు సంబంధించిన ఫైళ్లు మొత్తం కూడా డీవీఎం చేతుల్లోనే ఉంటాయి. జగన్‌ ప్రభుత్వంలో వ్యవహారం నడిపించిన రమణకు కీలకమైన పోస్టు ఇవ్వడంపై సంస్థ ఉద్యోగులు విమర్శలు చేస్తున్నారు. రుషికొండకు సంబంధించి కూటమి ప్రభుత్వానికి ఎంత శ్రద్ధ ఉందో ఈ నిర్ణయంతో తేలిపోయిందనే ఆరోపణలు వస్తున్నాయి. 

Also Read: రుషికొండ ఫైల్స్ మిస్సింగ్.. తలలు పట్టుకుంటున్న అధికారులు

Advertisment
Advertisment
తాజా కథనాలు