/rtv/media/media_files/2025/10/10/acb-2025-10-10-18-59-55.jpg)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా - తీసుకున్న ఇందిరమ్మ ఇల్లు(indiramma house) విషయంలో లంచాలు అడుగుతూ ఏసీబీ అడ్డంగా దొరికిపోతున్నారు పంచాయతీ సెక్రటరీలు. తాజాగా కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసేందుకు లంచం డిమాండ్ చేసి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు పంచాయతీ సెక్రటరీ. గంగాధర మండలం మధురానగర్ గ్రామానికి చెందిన గంగాధర లాస్యకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయింది.
రూ.10 వేలు లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కి
— Satya Telangana (@satya_telangana) October 10, 2025
కరీంనగర్ గంగాధర మండలం మధురానగర్‌కి చెందిన ఇందిరమ్మ ఇల్లు శ్రీకాంత్‌కు మంజూరు
బిల్లు కావాలంటే రూ.10 వేలు లంచం ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శి అనిల్ డిమాండ్
అదేంటని ప్రశ్నిస్తే తమ కృషి వల్లే ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయింద్యంటూ తేల్చి చెప్పిన అనిల pic.twitter.com/FzqldoYqgs
అయితే ఆమె భర్త శ్రీకాంత్ మధురానగర్ గ్రామపంచాయతీ కార్యదర్శి మునిగాల అనిల్ ను కలిశాడు. తనకు మంజూరైన బిల్లు చెల్లించాలని కోరాడు. అయితే ఫైలును ప్రాసెస్ చేసేందుకు అనిల్ రూ.10 వేలు డిమాండ్ చేశాడు. కార్యదర్శి చుట్టూ తిరిగి విసిగిపోయిన శ్రీకాంత్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు అధికారులు పక్కా ప్లాన్ తో అనిల్ లంచం తీసుకుంటుండగా, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
Also Read : నన్ను ఓడగొట్టారు... అంజన్‌కుమార్ సంచలన కామెంట్స్
లంచం అడిగితే కాల్ చేయండి
పంచాయతీ కార్యదర్శి(panchayat-secretary నుండి రూ. 10 వేలు స్వాధీనం చేసుకున్నారు. అనిల్ పై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టుకు తరలించారు. ప్రభుత్వాధికారులు ఎవరికి ప్రజలు లంచం ఇవ్వవద్దని, ఒకవేళ లంచం అడిగితే 1064 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు.
మరోవైపు హైదరాబాద్ లాలాగూడ సబ్‌డివిజన్ అసిస్టెంట్ ఇంజనీర్ భూమిరెడ్డి సుధాకర్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రూ.15 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ సిటీ రేంజ్ యూనిట్-2 అధికారులకు అడ్డంగా బుక్కయ్యాడు. సింగిల్ ఫేజ్ మీటర్ నుంచి త్రీ ఫేజ్ మీటర్ అప్‌గ్రేడ్ కోసం ఓ వ్యక్తి నుంచి లంచం డిమాండ్ చేశాడు సుధాకర్ రెడ్డి. దీంతో ఏసీబీని ఆశ్రయించాడు బాధితుడు. పక్కా ప్లాన్ ప్రకారం.. ఫిర్యాదు దారు నుంచి లంచం స్వీకరించిన వెంటనే ఏసీబీ అధికారులు నగదు స్వాధీనం చేసుకున్నారు.
Also Read : బసవతారకం ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత..రూ. 750 కోట్ల భూమికి హైడ్రా విముక్తి