/rtv/media/media_files/2025/10/10/anjankumar-2025-10-10-16-25-55.jpg)
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(jubliee hills by election) కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారింది. టికెట్ నవీన్ యాదవ్(naveen yadav) కు కేటాయించడంతో మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్(Congress Leader Anjan Kumar Yadav) అలకబూనారు. దీంతో ఆయనను పార్టీ పెద్దలు బుజ్జగించే పనిలో పడ్డారు. ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ బుజ్జగించారు. అంజన్‌కుమార్ ఇంటికి వెళ్లి ఆయనతో మాట్లాడారు. ఎలాంటి పరిస్థితుల్లో టికెట్ నవీన్ యాదవ్ కు కేటాయించాల్సి వచ్చిందో ఆయనకు వివరించారు.
అంజన్ కుమార్ యాదవ్ ఎప్పడు ఓడి పోలేదు..
— Tolivelugu Official (@Tolivelugu) October 10, 2025
ఓడ గొట్టారు కష్ట కాలంలో ఉన్నపుడు నేను కంటెస్ట్ చేస్తే..
మంచి రోజులు వచ్చేసరికి ఇంక ఎవరో కంటెస్ట్ చేస్తే నాకు బాధగా ఉంటది కదా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే నాకు టికెట్ ఇచ్చేవారు కదా - అంజన్ కుమార్ యాదవ్ pic.twitter.com/Bkc6FRYKRR
Also Read : బసవతారకం ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత..రూ. 750 కోట్ల భూమికి హైడ్రా విముక్తి
అంజన్ కుమార్ సైలెంట్
అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి మీడియాతో మాట్లాడిన అంజన్ కుమార్.. పార్టీ చర్యలతో మనస్తాపానికి గురైనట్లుగా తెలిపారు. కష్టకాలంలో పార్టీ వెంట ఉన్న తనను ఇప్పుడు పక్కనపెడతారా? అని ఆవేదన చెందినట్లుగా వెల్లడించారు. పార్టీలో తాను చాలా సీనియర్ అని, తాప్పుడూ ఓడిపోలేదన్నారు. తనను ఓడగొట్టారని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో తనకు టికెట్ ఇస్తే గెలిచేవాడినని ధీమా వ్యక్తం చేశారు. కష్టకాలంలో పార్టీ కోసం పనిచేశానని, పార్టీలో అనేక పదవులు చేపట్టానన్నారు. రెండు సార్లు హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశానని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌కు పార్టీకి చిత్తశుద్ధి ఉంటే తనకే టికెట్ ఇచ్చేదని అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తారా అని.. RTV అడిగిన ప్రశ్నకు అంజన్ కుమార్ మాత్రం సైలెంట్ గా ఉండిపోయారు. కాంగ్రెస్ కోసం పనిచేస్తా.. రాహుల్‌ను ప్రధానిని చేస్తా అంటూ కవరింగ్ చేశారు. అంజన్ కుమార్ వ్యవహార శైలితో కాంగ్రెస్ పార్టీలో టెన్షన్ నెలకొంది. మరోవైపు జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలుస్తుందని, అంజన్ సారథ్యంలోనే ఎన్నికల్లో పార్టీ ముందుకు వెళ్తుందని మంత్రి పొన్నం తెలిపారు. ఉప ఎన్నికలో అందరం కలిసి పనిచేస్తామన్నారు.
అలకలు బుజ్జగింపులు - అంజన్ కుమార్ యాదవ్ ఇంటికి మంత్రులు పొన్నం ప్రభాకర్,వివేక్ వెంకట్ స్వామి,ఏఐసీసీ కార్యదర్శి విష్ణు నాథ్
— 365_NEWS (@_NEWS_365) October 10, 2025
అంజన్ కుమార్ ను బుజ్జగిస్తున్న మంత్రులు, ఏఐసీసీ కార్యదర్శి
జూబ్లీహిల్స్ టికెట్ దక్కకపోవడంతో తీవ్ర నిరాశతో ఉన్న అంజన్ కుమార్ యాదవ్. pic.twitter.com/yVYEImOJLH
Also Read : వీడు కోచ్ కాదు...కామాంధుడు..వాలీబాల్ కోచ్ వేధింపులు..విద్యార్థిని ఆత్మహత్య
నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉన్న బీసీ వర్గం ఓట్లను ఆకర్షించడానికి నవీన్ యాదవ్ ను కాంగ్రెస్ బరిలోకి దించిందని తెలుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించబడకముందు నవీన్ యాదవ్ ఓటర్ కార్డుల పంపిణీ కార్యక్రమం పేరుతో ఓటర్ ఐడీ కార్డులను పంపిణీ చేశారనే ఆరోపణలపై ఎన్నికల నియమావళి ఉల్లంఘన కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు బీఆర్ఎస్ మాగంటి గోపీనాథ్ పట్ల ఉన్న సానుభూతి, నియోజకవర్గంలో వారి బలంపై ఆశలు పెట్టుకుంది. బీజేపీ ఇంకా తమ అభ్యర్థిని ప్రకటించలేదు. జూబ్లీహిల్స్‌లో సుమారు 30% ముస్లిం ఓటర్లు ఉండటంతో, వీరి మద్దతు ఉపఎన్నిక ఫలితాన్ని ప్రభావితం చేయడంలో కీలకం కానుంది. నవంబర్ 11 పోలింగ్, నవంబర్ 14 ఫలితాలను వెల్లడించున్నారు. అక్టోబర్ 13 నుండి 21 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (BRS) మరణం కారణంగా ఈ ఉపఎన్నిక అనివార్యమైంది.