/rtv/media/media_files/2025/10/21/k-ramp-collections-2025-10-21-11-28-15.jpg)
K Ramp Collections
K Ramp Collections: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) నటించిన తాజా చిత్రం 'కె-ర్యాంప్', దీపావళి సందర్భంగా శనివారం థియేటర్లలో విడుదలైంది. జైన్స్ నాని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యుక్తి తరేజా కథానాయికగా నటించారు. రొమాంటిక్ కామెడీ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమా మొదటి 3 రోజుల్లో మంచి కలెక్షన్లు రాబట్టింది.
K Ramp 3 Days Collections
తాజాగా చిత్రబృందం విడుదల చేసిన పోస్టర్ ప్రకారం, ‘కె-ర్యాంప్’ విడుదలైన 3 రోజుల్లో రూ. 17.5 కోట్లు వసూలు చేసింది. దీపావళి రోజునే ఈ సినిమా రూ. 6.2 కోట్లు కలెక్ట్ చేయడం విశేషం. ముఖ్యంగా సినిమా ఇప్పటికే బ్రేక్ ఇవెన్ చేరుకుందని నిర్మాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Chepinnatte Kumar gadu theaters lo kummi padesadu 🤙😎
— BA Raju's Team (@baraju_SuperHit) October 21, 2025
𝐃𝐈𝐖𝐀𝐋𝐈 𝐖𝐈𝐍𝐍𝐄𝐑 #KRamp BREAKEVEN DONE IN 3 DAYS 🔥🔥🔥
Book Your Tickets Now..!!
— https://t.co/mckITSiLC7#KRampKaDiwali 🧨 pic.twitter.com/w8bTvqA32a
కథ విషయానికొస్తే, ఇది పూర్తిగా కేరళ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే కథ. హీరో పాత్రను కిరణ్ అబ్బవరం చాలా ఎనర్జీగా పోషించాడు. ఫస్ట్ హాఫ్‌లో కొన్ని సీన్లు నవ్వులు తెప్పించినా, మిగతా కథ మాత్రం కొంచెం రొటీన్‌గా ఉందని ప్రేక్షకుల అభిప్రాయం. ముఖ్యంగా డబుల్ మీనింగ్ డైలాగులు కొన్ని ప్రేక్షకులను అసౌకర్యానికి గురిచేశాయని కామెంట్స్ వచ్చాయి.
దర్శకుడు ఎంచుకున్న కథలో కొత్తదనం లేకపోవడం కొంత మైనస్ అయినప్పటికీ, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, కామెడీ పంచులతో సినిమా ఆకట్టుకుంది. అయితే, సెకండ్ హాఫ్ మాత్రం కొంత వరకు మెప్పించింది. హీరోయిన్‌కు ఓ ప్రత్యేకత (డిజార్డర్) ఉండటం వల్ల వచ్చే కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను అలరించాయి. అలాగే తండ్రీకొడుకుల మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్లు భావోద్వేగాన్ని కలిగించాయి.
చైతన్ భరద్వాజ్ అందించిన సంగీతం సినిమాకు అంతగా హెల్ప్ అవ్వలేదు. హస్య మూవీస్ నిర్మించిన ఈ సినిమా, కథ పరంగా పెద్దగా కొత్తదనం లేకున్నా, కిరణ్ అభిమానులకు ఓ మిడిల్ రేంజ్ ఎంటర్టైనర్‌గా థియేటర్లలో సందడి చేస్తోంది.
మొత్తానికి, వసూళ్ల పరంగా సినిమా బాగానే నిలబడింది కానీ, కంటెంట్ పరంగా ప్రేక్షకుల అంచనాలను పూర్తిగా అందుకోలేదనే అభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.