/rtv/media/media_files/2025/04/30/JoAKWeCxtSfFMiHu34ln.jpg)
Nursing Student
Gadwal Tragedy: తాము చేస్తున్నది యాచకవృత్తిని తమ పిల్లలు చేయద్దనుకున్నారు.తాము చదువుకోకున్న తమ పిల్లలను చదివించాలనుకున్నారు. వారు ఉన్నత స్థితిలో ఉంటే చూసి మురిసిపోవాలని కలలుగన్నారు. కానీ వారి ఆశలన్నీ ఆవిరయ్యాయి. చిన్నకూతురును డాక్టర్ చేయాలనుకున్న వారి కోరిక తీరుతుందనుకుంటున్న తరుణంలోనే రోడ్డు ప్రమాదం రూపంలో ఆమెను మృత్యువు వరించింది. చేతికి అందివస్తుందనుకున్న కూతురు రక్తపుముద్ధగా మారడంతో ఆ కుటుంబం తల్లడిల్లిపోయింది.
నారాయణపేట జిల్లా మక్తల్ మండలం లింగంపల్లికి చెందిన జి. మహేశ్వరి (20) అనే నర్సింగ్ విద్యార్థి మంగళవారం గద్వాల జోగులాంబ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. బొలెరో డ్రైవర్ తాగిన మత్తులో వాహనం నడిపి ఆ విద్యార్థి మృతికి కారణమయ్యాడు.గ్రామానికి చెందిన యాచకులు మారెప్ప, మణెమ్మ దంపతులు చాలాకాలం నుంచి అదే వృత్తితో జీవనం పొందుతున్నారు. వారి కుటుంబం పెద్దల తరం నుంచి యాచక వృత్తినే నమ్ముకుని కాలం గడుపుతోంది. అలాంటి కుటుంబం తమ పిల్లలు గొప్ప చదువులు చదివి ప్రయోజకులు కావాలని, తమ తరంతోనే యాచక వృత్తికి స్వస్తి పలకాలని భావించి పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తున్నారు. గ్రామంలో ఒక పూరి గుడిసెలో జీవనం గడుపుతూ తెల్లారిందే మొదలు ఇల్లు ఇల్లు తిరిగి పోగుచేసిన డబ్బులతో తమ పిల్లలను చదివించుకుంటున్నారు. తండ్రి మారెప్ప కొంతకాలంగా పక్షవాతంతో మంచాన పడ్డాడు. దీంతో వారి జీవనాధారం మరింత దీనస్థితికి చేరింది. ఈ దంపతులకు ఐదుగురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నాడు.
చివరి అమ్మాయి మహేశ్వరి గద్వాల్ జిల్లాలో నర్సింగ్ ఫైనల్ ఇయర్ చదువుతూ అక్కడే హాస్టల్‌లో ఉంటుంది. గద్వాల జిల్లా కేంద్రంలోని కొత్త హోసింగ్ బోర్డులో రిక్వెస్ట్ బస్ స్టాప్ దగ్గర మంగళవారం బస్సు కోసం ఎదురు చూస్తుండగా అకస్మాత్తుగా బొలోరా వాహనం వేగంగా దూసుకొచ్చి మహేశ్వరితో పాటు మరికొంత మంది విద్యార్థులను బలంగా ఢీకొట్టింది. దీంతో మహేశ్వరితో పాటు మరో విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందింది.
ఇది కూడా చదవండి: KTR: కేటీఆర్‌కు గాయం.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రియాక్షన్
కన్నకూతురు ఎదిగివచ్చి తమ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటుందని భావించింది ఆ యాచక కుటుంబం. కానీ జీవంలేకుండా బిడ్డ ఇంటికి చేరడంతో వారు గుండెలవిసేలా దుంఖించిన తీరు అక్కడున్నవారిని కంటతడి పెట్టించింది.
Also Read: Akshaya Tritiya 2025 నేడు అక్షయ తృతీయ.. బీరువాలో ఈ ఒక్కటి ఉంచితే డబ్బులే డబ్బులు