KTR: కేటీఆర్‌కు గాయం.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రియాక్షన్‌

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ జిమ్ వర్కౌట్ సెషన్‌లో గాయం అయినట్లు తెలిపారు. కాగా త్వరగా కోలుకోవాలంటూ బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు.కేటీఆర్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

New Update
pawan and ktr

pawan and ktr

KTR: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు గాయమైంది. జిమ్ వర్కౌట్ సెషన్‌లో స్లిప్ డిస్క్ గాయం అయినట్లు కేటీఆర్ తెలిపారు. కొన్ని రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు తెలిపారు. వైద్యుల సలహా మేరకు రెస్ట్ తీసుకొని త్వరలో తిరిగి వస్తానని ఆశిస్తున్నాను అంటూ మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. త్వరగా కోలుకోవాలంటూ బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కామెంట్స్ చేస్తున్నారు. 

ఇది కూడా చూడండి: Pak-India:భారత్‌తో ఉద్రిక్తతల వేళ పాక్‌కు బిగ్ షాక్.. సైనిక అధికారులు, జవాన్ల భారీ రాజీనామాలు!

Also Read :  భద్రాచలంలో రోడ్డు ప్రమాదం.. స్పాట్ లోనే ఏడుగురు

ఇదిలా ఉండగా రాజకీయపరంగా ఎలా ఉన్నా, రాష్ట్రాలు వేరైనా వ్యక్తిగతంగా ఎలాంటి ఈగోలు ఉండవని జనసేన పార్టీ అధినేత  ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి నిరూపించారు. రాజకీయపరంగా విభేదించినప్పటికీ కేటీఆర్‌తో తనకున్న స్నేహన్ని మరోసారి రుజువు చేసుకున్నారు. తెలంగాణ మాజీ మంత్రి కె.టి.రామారావు జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా గాయపడ్డట్టు ఆయన పోస్టు చేయడంతో.. పవన్ కల్యాణ్ స్పందించారు. కేటీఆర్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, ఆయన ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.

ఇది కూడా చూడండి: Sitakka: నీ బిడ్డ కార్లలో తిరిగితే.. మా ఆడబిడ్డలు బస్సులో కూడా తిరగొద్దా?: కేసీఆర్ కు సీతక్క స్ట్రాంగ్ కౌంటర్!

పవన్ కల్యాణ్ ట్వీట్:

సోదరుడు తెలంగాణ రాష్ర్ట మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ జిమ్‌లో వ్యాయామం చేస్తూ గాయపడ్డారని తెలిసింది.వారికి గాయం జరిగిన సంగతి తెలుసుకొని బాధ పడ్డాను. వైద్యుల సూచనల మేరకు తగిన విశ్రాంతి తీసుకోవాలని కోరుతున్నాను. మీరు త్వరగా కోలుకోవాలని మనసారా ప్రార్థిస్తున్నాను.” అంటూ పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.కాగా.. పవన్ కల్యాణ్ ట్వీట్ కు స్పందించిన కేటీఆర్ థ్యాంక్యూ చెబుతూ రీట్విట్ చేశారు. దీంతో అటు బీఆర్‌ఎస్‌ నాయకులు, ఇటు పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: పాకిస్తాన్‌లో 170 న్యూక్లియర్ బాంబులు.. వాటి రిమోట్ ఎవరి చేతిలో ఉందో తెలుసా..?

 

gym | ap-deputy-cm-pawan-kalyan | injured | brs-working-president-ktr

Advertisment
Advertisment
తాజా కథనాలు