/rtv/media/media_files/2025/02/04/SwUrRkFPyJbyvxMm42pa.webp)
SC Categorization
SC Categorization : ఎస్సీవర్గీకరణ, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేసేందుకు రాష్ర్ట ప్రభుత్వం చేపట్టిన సమగ్రకుల గణన సర్వే నివేదికకు ప్రభుత్వానికి అందజేసింది. ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన షమీమ్ అక్తర్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ కూడా తన నివేదికను సమర్పించింది. అయితే ఎస్సీ వర్గీకరణపై సందిగ్ధత నెలకొన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా ఎస్సీలను ఏబీసీడీలుగా వర్గీకరించాలని సాగుతున్న పోరాట నేపథ్యానికి భిన్నంగా తాజా నివేదిక ఎస్సీలను ఏబీసీ గ్రూపులుగా విభజించాలని సూచించినట్లు తెలుస్తోంది.
ఆయా గ్రూపుల్లో మాదిగ, మాలతో సహా మిగిలిన ఉపకులాల జనాభాను పరిగణలోకి తీసుకుని వారికి ఇప్పటివరకు వివిధ రంగాల్లో దక్కిన అవకాశాలను పరిగణలోకి తీసుకొని రిజర్వేషన్లను కేటాయించాలని కమిషన్ సూచించింది. కమిషన్ సమర్పించిన నివేదికపై మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం సోమవారం రెండు దఫాలుగా చర్చించింది. అయితే నివేదికను మాత్రం వెల్లడించలేదు.అయితే ఈరోజు నివేదికను క్యాబినెట్‌లో ప్రవేశపెట్టి చర్చించిన అనంతరం శాసనసభలో ప్రవేశపెట్టి చర్చించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఇది కూడా చదవండి: వయసును బట్టి మఖానా ఎంత తినాలి.. నిపుణులు ఏమంటున్నారు?
నిజానికి ఎస్సీ వర్గీకరణపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచే ఉద్యమాలు సాగుతున్నాయి. ఎస్సీలకు రాజ్యంగబద్ధంగా 15శాతం రిజర్వేషన్ అమలవుతున్నది. అయితే ఆ రిజర్వేషన్ లో తమకు అన్యాయం జరుగుతున్నదని మాదిగలు పోరుబాట పట్టారు. దీంతో 1995లో నాటి ప్రభుత్వం జస్టిస్ రామచంద్రరాజు కమిషన్‌ను నియమించింది. కమిషన్ పూర్తిస్థాయి స్టడీ చేసిన తర్వాత మాదిగల వాదనను సమర్ధిస్తూ నివేదికను సమర్పించింది. ఆ నివేదిక ఆధారంగా నాటి టీడీపీ ప్రభుత్వం 1997 జూన్‌లో 15 శాతం ఉన్న ఎస్సీ కోటాను ఏ.బీ,సీ,డీలగా విభజిస్తూ జీవోను విడుదల చేసింది. దాని ప్రకారం.. గ్రూప్-ఏలో రెల్లి సహా దానికి అనుబంధంగా ఉన్న 12 కులాలకు 1 శాతం రిజర్వేషన్ కేటాయించింది. వాటిని అట్టడుగు కులాలుగా గుర్తించింది. గ్రూప్-బిలో మాదిగ, దాని అనుబంధంగా ఉన్న 18 కులాలను చేర్చి.. వీరికి 7 శాతం కోటాను ఇచ్చింది. ఇక, గ్రూప్-సిలో మాల సహా 25 కులాలను చేర్చి, వీరికి 6 శాతం రిజర్వేషన్ కేటాయించింది. గ్రూప్-డీలో ఆది ఆంధ్రులతోపాటు మరో 4 కులాలను చేర్చి వీరికి కూడా 1 శాతం రిజర్వేషన్‌ను ఇచ్చింది. అయితే, ఈ కేటాయింపులపై పలువురు కోర్టుకెళ్లడంతో ఆ ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. దాంతో, వర్గీకరణ కోసం 2000లో మరోసారి ‘రేషనలైజేషన్ ఆఫ్ రిజర్వేషన్’ చట్టాన్ని అప్పటి ప్రభుత్వం ఆమోదించింది. దీనిని 2004లో సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఉమ్మడి ఏపీలో అప్పటి ప్రభుత్వం ఎస్సీలను నాలుగు గ్రూపులుగా విభజించగా.. అక్తర్ కమిషన్ మూడు గ్రూపులుగా విభజించాలని సూచించినట్టు సమాచారం.
ఇది కూడా చదవండి: పురుషులు ఈ లక్షణాలను ఎప్పుడూ విస్మరించవద్దు
అయితే ఏ,బీ కులాలు తక్కువ లబ్ధిపొందాయని, సీ,డీ గ్రూపుల కులాలు తమ జనాభా శాతానికంటే ఎక్కువ లబ్ధి పొందాయని 1997లో తేలింది.ఆ తర్వాత 2000లో ఏపీ ప్రభుత్వం ఎస్సీలను వర్గీకరిస్తూ రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ చట్టం చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఈ చట్టాన్ని ఏకగ్రీవంగా ఆమోదించగా, అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ ఆమోదంతో అమలులోకి వచ్చింది. ఎస్సీలను ఏ,బీ,సీ,డీ గ్రూపులుగా వర్గీకరిస్తూ, వెనుకబాటుతనం, జనాభా నిష్పత్తి ప్రకారం ఆ కులాలకు రిజర్వేషన్ కోటాను అమలుచేశారు. కానీ 2004లో సుప్రీంకోర్టు దాన్ని కొట్టివేయడంతో ఈ చట్టానికి మరోసారి చుక్కెదురైంది. ఎస్సీ కులాల జాబితాలో జోక్యం, పునర్వర్గీకరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని తేల్చిచెప్పింది. నాటి నుంచి పెండింగ్‌లోనే ఉన్నది.అయితే గత ఆగస్టులో సుప్రీంకోర్టుకు చెందిన ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఎస్సీ రిజర్వేషన్‌ను వర్గీకరించే అధికారం రాష్ర్టాలకు ఉందని తేల్చిచెప్పింది. ఆ తీర్పును అధ్యయనం చేసి, తగు సిఫారసులు చేసేందుకు ప్రభుత్వం క్యాబినెట్ సబ్‌కమిటీతోపాటు, హైకోర్టు విశ్రాంత జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను నియమించింది.
Also Read: Trump: మెక్సికో, కెనడాకు బంపరాఫర్ ఇచ్చిన ట్రంప్ ..నెల రోజుల పాటు ఇక ఆ కష్టాలు ఉండవు!
ఎస్సీ వర్గీకరణపై అధ్యయనం చేసిన జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ రాష్ట్రంలోని ఎస్సీలను మూడు గ్రూపులుగా వర్గీకరించాలని చూసించినట్లు తెలుస్తోంది. గతంలో ఉన్న ‘ఏ బీ సీ డీ’గా కాకుండా ఇప్పుడు ‘ఏ బీ సీ’ గ్రూపులుగా వర్గీకరించాలని ప్రభుత్వానికి సమర్పించిన తన నివేదికలో పేర్కొన్నది. ఆయా గ్రూపుల్లో మాదిగ, మాల సహా మిగిలిన ఉప కులాల జనాభా శాతం, వాటికి ఇప్పటి వరకు వివిధ రంగాల్లో దక్కిన అవకాశాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని రిజర్వేషన్లను కేటాయించాలని నివేదికలో పొందుపరిచినట్టు సమాచారం.ఆయా కులాల్లోని విద్య, ఉపాధి, రాజకీయ, ఆర్థిక విషయాలతోపాటు పలు అంశాలపై 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుని కమిషన్ అధ్యయనం చేసింది. మొత్తం ఎస్సీల్లో ఏ కులం వారు ఎంతమంది ఉన్నారు? ఉప కులాల జనాభా ఎంత!? తదితర అంశాలపై సమగ్రంగా అధ్యయనం చేసింది. ఎవరెవరిని ఏయే గ్రూపుల్లో ఉంచాలనే అంశాన్ని పరిశీలించింది.
Also Read: Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే..మీదేనా మరి చూసుకోండి!
2011 జనాభా లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో సుమారు 52.50 లక్షల మంది ఎస్సీలుండగా.. వీరిలో మాదిగలు 33.50 లక్షలు, మాలలు 19 లక్షల మంది ఉన్నారు. అయితే వీరిలో అక్షరాస్యత శాతం ఎంత? విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు ఎంతమంది? ఉపకార వేతనాలను ఎంతమంది అందుకున్నారు? ఎస్సీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం అందించే ఆర్థిక సాయాన్ని ఎంతమంది పొందారనే వివరాలను కూడా సేకరించింది. అలాగే, ఎస్సీల్లో ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారనే వివరాలను కూడా సేకరించింది. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో కలిపి దాదాపు 94 వేల మందికి పైచిలుకు ఉద్యోగులు ఉన్నట్టు ఆయా శాఖలు కమిషన్‌కు ఇచ్చిన రిపోర్టుల్లో తేలింది.ఇక రాజకీయ అవకాశాలపై కూడా ఆధ్యయనం చేసింది. ఈ అధ్యయనంపై నివేదిక సమర్పించిన కమిషన్ ఉమ్మడి ఏపీలో అప్పటి ప్రభుత్వం ఎస్సీలను నాలుగు గ్రూపులుగా విభజించగా.. అక్తర్ కమిషన్ మూడు గ్రూపులుగా విభజించాలని సూచించింది.