Tirupati Deputy Mayor Election :తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక. అర్థరాత్రి తిరుపతిలో ఉద్రిక్తత

డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడిన నేపథ్యంలో రెండో రోజు తిరుపతిలో అర్థరాత్రి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ నేత అభినయ్ రెడ్డి డ్రైవర్ ఇంటి వద్ద, బంధువు కౌశిక్, టౌన్ బ్యాంకు వైస్ చైర్మన్ వాసుదేవ యాదవ్ ఇళ్ల వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

New Update
Tirupati Deputy Mayor Election

Tirupati Deputy Mayor Election

Tirupati Deputy Mayor Election :  డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడిన నేపథ్యంలో రెండో రోజు తిరుపతి లో అర్థరాత్రి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి డ్రైవర్ ఇంటి వద్ద, అభినయ్ బంధువు కౌశిక్, టౌన్ బ్యాంకు వైస్ చైర్మన్ వాసుదేవ యాదవ్ ఇళ్ల వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రెండు పార్టీల నేతలు పెద్ద ఎత్తున రోడ్లమీదకు చేరడంతో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఒక క్రమంలో ఒకరిపై ఒకరు దాడిచేశారంటూ పుకార్లు షికారు చేయడంతో కార్యకర్తలు రెచ్చిపోయారు. ఈ ఘటనలో రెండు వాహనాలు ధ్వంసం  అయ్యాయి. 

ఇది కూడా చదవండి: వయసును బట్టి మఖానా ఎంత తినాలి.. నిపుణులు ఏమంటున్నారు?

తనను కిడ్నాప్‌ చేయడానికి కొంతమంది ప్రయత్నించారని 45వ డివిజన్ కార్పోరేటర్ అనీష్ భార్య డాక్టర్ మమత ఆరోపించారు. సమాచారం అందుకున్న తిరుపతి ఎంపీ గురుమూర్తి, భూమన అభినయ్ రెడ్డి అక్కడికి చేరుకుని ఆమెను పోలీసులు సమక్షంలో బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దీంతో ఇరిపార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఘర్షణ చెలరేగింది. ఇరు వర్గాలకు పోలీసులు సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. పోలీసులు ఎంత చెప్పినా వినకపోవడంతో లాఠీలకు పని చెప్పారు. ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ప్రజాస్వామ్యబద్ధంగా డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరిపిస్తారన్న నమ్మకం లేదన్నారు.కూటమి నేతలు, కార్యకర్తలు వైసీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని మండిపడ్డారు.

ఇది కూడా చదవండి: విడాకులు తీసుకున్న తల్లిదండ్రుల పిల్లలకు స్ట్రోక్ ప్రమాదం ఉందా?

తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక మంగళవారానికి వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం సోమవారం ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. మొత్తం 50 మంది సభ్యులు ఓటింగ్ లో పాల్గొనాల్సి ఉండగా, కేవలం 22 మంది హాజరయ్యారు. 50 శాతం కోరం లేని కారణంగా ఎన్నికల అధికారి, జేసీ శుభం బన్సల్ తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికను నేటికి వాయిదా వేశారు.

ఇది కూడా చదవండి: వయసును బట్టి మఖానా ఎంత తినాలి.. నిపుణులు ఏమంటున్నారు?

ఇదిలా ఉండగా తిరుపతి డ్యిపూటి మేయర్ ఎన్నికల్లో 22 మంది వైసీపీ కార్పొరేటర్లు కూటమికి మద్దతు తెలిపారని, మరో 6 మంది రేపు ఉదయం వస్తారని జనసేన నేత కిరణ్ రాయల్ తెలిపారు. సోమవారం ఉదయం జరిగిన నాటకీయ పరిణామాలు అందరూ చూశారు. తమ కార్పొరేటర్లను వైసీపీ వాళ్లే కిడ్నాప్ చేయించుకొని కూటమి ప్రభుత్వంపై నింద మోపేందుకు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. ఉదయం మిస్సయిన నలుగురు కార్పొరేటర్లు తాము సురక్షితంగా ఉన్నామని వారే వీడియో ద్వారా తెలిపారు. ఎన్నిక గందరగోళం వల్ల తాము సురక్షిత ప్రాంతానికి వచ్చేశామని వారే చెప్పారు. భూమన కరుణాకరరెడ్డి గతంలో ఎన్నో అరాచకాలు చేశారని, అవన్నీ తిరుపతి ప్రజలందరూ చూశారన్నారు. డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం కరుణాకరరెడ్డి నీచ రాజకీయాలకు పాల్పడ్డారు. గతంలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అనేక అరాచకాలకు పాల్పడింది. దొంగ ఓటరు కార్డులు తయారు చేయించి తమిళనాడు నుంచి వ్యక్తులను ఇక్కడికి తరలించి దొంగ ఓట్లు వేయించారని ఆరోపించారు. మేం ఎలాంటి దౌర్జన్యాలకు, కిడ్నాప్లకు పాల్పడలేదు. తిరుపతి డ్యిపూటి మేయర్ ఎన్నిక మంగళవారం ప్రశాంత వాతావరణంలో జరగాలి. తన కొడుకు భూమన అభినయ్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు కోసం కరుణాకర్ రెడ్డి ఇలాంటి నీచ రాజకీయాలకు పాల్పడ్డుతున్నారని’ కిరణ్ రాయల్ మండిపడ్డారు.

ఇది కూడా చదవండి: పురుషులు ఈ లక్షణాలను ఎప్పుడూ విస్మరించవద్దు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు