/rtv/media/media_files/2025/02/04/sCZgJQOVVwGkPtjYSywB.jpg)
Mahatma Gandhi Bus Station (MGBS)
Mahatma Gandhi Bus Station (MGBS) : తెలంగాణ ప్రభుత్వం మహిళలకు కల్పిస్తున్న మహాలక్ష్మీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంతో బస్సుల్లో రద్దీ గణనీయంగా పెరిగింది. గతంలో ఇతర నగరాలనుంచి హైదరాబాద్‌కు బస్సు ప్రయాణం చేయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించేవారు. కానీ ఉచిత బస్సు సౌకర్యంతో రాష్ర్టంలోని ఇతర ప్రాంతాలనుంచి వచ్చే ప్రయాణీకుల సంఖ్య రెట్టింపుస్థాయిలో పెరిగింది. గతంలో రోజుకు 30-35 లక్షల మంది బస్సుల్లో ప్రయాణం చేస్తే ఇప్పుడు ఆ సంఖ్య డబుల్ అయింది. దీంతో బస్సు సర్వీసులు కూడా పెరిగాయి.
Also Read: America: అక్రమ వలసదారులతో భారత్ కు పయనమైన అమెరికా విమానం!
అయితే రాష్ర్టంలోని ఏ ప్రాంతం నుంచి హైదరాబాద్‌కు రావాలన్నా కేవలం రెండు బస్టాండ్లు మాత్రమే ఉన్నాయి. అందులో ఒకటి ఎంజీబీఎస్ కాగా, రెండవది జేబీఎస్. ఈ రెండు బస్టాండ్ల నుంచే వివిధ జిల్లాలకు బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే ప్రయాణీకుల సంఖ్య రెట్టింపవడంతో ఈ రెండు బస్టాండ్లపైన ఒత్తిడి పెరిగిపోతుంది. ప్రతిరోజు ఈ రెండు బస్టాండ్ల నుంచి జిల్లాలకు 1.5 లక్షలమంది ప్రయాణీకులు, సుమారు 5 వేల బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇక సెలవులు, పండుగలు, వీకెండ్స్ లో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. దీంతో బస్టాండ్లలో విపరీతమైన రద్దీ పెరిగిపోతుంది. ప్రయాణీకులు కూడా సరైన సమయానికి బస్సులు దొరకగా గమ్యస్థానానికి సకాలంలో చేరుకోలేకపోతున్నారు. మరోవైపు నగరంలో ఏ మూలకు ఉన్నా తమ గ్రామాలకు వెళ్లాలంటే అందరూ ఎంజీబీఎస్ లేదా జేబీఎస్ కు వచ్చి బస్సులు ఎక్కాల్సిందే. దీనివల్ల నగరంలోనే సగం సమయం గడచిపోతుంది. ఈ ఇబ్బందులను తొలగించడానికి ఆర్టీసీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రయాణీకులకు అనుకూలంగా మరో మూడు బస్టాండ్లు నిర్మించాలని సంకల్పించారు. ముఖ్యంగా ఎంజీబీఎస్ మీద ఒత్తిడి తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి ఈ కూరగాయలు తినాలి
మహబూబ్‌నగర్, కర్నూల్, బెంగళూరు ప్రాంతాలకు వెళ్లేవారు ఎంజీబీఎస్‌లో బస్సుఎక్కి ఆరాంఘర్ మీదుగా వెళ్లా్ల్సి ఉంటుంది. ఈ ప్రాంతం గుండా రోజుకు సుమారు వెయ్యి నుంచి 15 వందల బస్సులు ప్రయాణీస్తాయి. అయితే బస్సు ఎక్కాలంటే మాత్రం ఎంజీబీఎస్ కు రావాలసిందే. దీంతో ఎంజీబీఎస్ బస్టాండ్‌పై ఒత్తిడి తగ్గించాలంటే ఆరాంఘర్ చౌరస్తాలో అత్యాధునిక హంగులతో బస్టాండ్ నిర్మించాలని భావిస్తోంది. అలాగే వరంగల్, నల్గొండ జిల్లాల నుంచి వచ్చే బస్సుల కోసం ఉప్పల్‌లో, నల్గొండ, ఏపీలోని పలు జిల్లాల నుంచి వచ్చే ప్రయాణీకుల కోసం ఎల్బీనగర్‌లో బస్టాండ్లు నిర్మించాలని యోచిస్తోంది. అన్ని ప్రాంతాలకు ఎంజీబీఎస్ నుంచే బస్సులు నడపకుండా నగర శివారు ప్రాంతాలైన ఎల్బీనగర్, ఉప్పల్ ప్రాంతాల నుంచే నడపాలని యోచిస్తున్నారు. అందుకు అనుగుణంగా ఇక్కడ కూడా బస్ స్టాండ్లు నిర్మించాలని యోచిస్తున్నారు.
Also Read: Trump: మెక్సికో, కెనడాకు బంపరాఫర్ ఇచ్చిన ట్రంప్ ..నెల రోజుల పాటు ఇక ఆ కష్టాలు ఉండవు!
ఈ బస్టాండ్లను అన్ని రకాల సదుపాయాలతో నిర్మిస్తే నగర శివారు ప్రాంతాల వారికి అనుకూలంగా ఉండడంతో పాటు ఏంజీబీఎస్ బస్టాండ్ పైన ఒత్తిడి తగ్గుతుందని ఆర్టీసీ సంస్థ భావిస్తోంది. ఇప్పటికే కరీంనగర్, ఆదిలాబాద్, సిద్దిపేట తదితర జిల్లాలకు వెళ్లేందుకు వీలుగా జేబీఎస్ బస్టాండును గతంలోనే నిర్మించారు. ఇప్పుడు మరో మూడు బస్టాండ్లు నిర్మిస్తే జిల్లాల నుంచి వచ్చే ప్రయాణీకుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో పాటు ఎంజీబీఎస్ బస్టాండ్ పైనా ఒత్తిడి తగ్గుతుందని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు.