/rtv/media/media_files/2026/01/11/winter-season-2026-01-11-06-51-43.jpg)
Winter Season
తెలంగాణలో శీతల గాలులు వణికిస్తున్నాయి. రాత్రి నుంచి ఉదయం వరకు తీవ్రంగా చలి(winter) ఉంటోంది. ఉదయం 8 నుంచి 11 గంటల మధ్య, మళ్లీ సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్య చలి వణికిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు పలుప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో 7.9 డిగ్రీల సెల్సియస్, ఆదిలాబాద్ జిల్లా భీంపూర్‌లో 7 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. 12 జిల్లాల్లో 10 డిగ్రీల లోపు, 8 జిల్లాల్లో 10.1-11 మధ్య, ఇక మిగతా జిల్లాల్లో 11.1-14 డిగ్రీల మధ్య రికార్డయ్యాయి.
Also Read: దారుణం.. 19ఏళ్ల యువతిపై పోలీస్ డ్రైవరే సామూహిక అత్యాచారం
Cold Wave Conditions In Telangana
రాష్ట్రం వైపు తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి దిగువ స్థాయి గాలులు వీస్తున్నాయి. రానున్న మూడు రోజుల్లో చలితో పాటు 11 నుంచి 15 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణశాఖ తెలిపింది.
Also Read: బంగ్లాదేశ్‌లో మరో హిందూ హత్య.. అల్లర్ల పేరుతో 20రోజుల్లో ఆరుగురు బలి
Follow Us