Liquor: తెలంగాణలో నేటితో ముగియనున్న మద్యం టెండర్లు.. భారీగా పెరుగుతున్న పోటీ
తెలంగాణలో నేటితో మద్యం టెండర్లు ముగుస్తున్నాయి. చివరి రోజు కావటంతో భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు. దీనికోసం ఎక్సైజ్ కౌంటర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఒక్కో దుకాణానికి 50 నుంచి 200 దరఖాస్తులు వస్తున్నాయని అధికారులు వెల్లడించారు.