అల్లు అర్జున్ కేసులో తెలంగాణ సర్కార్‌కు బిగ్‌షాక్ తగిలింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. సంధ్య థియేటర్ దగ్గర లాఠీ ఛార్జి చేసిన పోలీసులపై చర్యలకు ఆదేశించింది. న్యాయవాది రామరావు దాఖలు చేసిన పిటిషన్‌పై NHRC విచారణ చేపట్టింది. నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని డీజీపీ జితేందర్‌కు ఆదేశాలు జారీ చేసింది. రద్దీని నియంత్రించడంలో పోలీసులు ఫేయిల్ అయ్యారని NHRC రామారావు ఫిర్యాదు మేరకు తెలంగాణ సర్కార్ పై చర్యలకు సిద్ధమైంది. Also Read: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబులు..! ఏం జరిగిందంటే..? అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ ప్రీమియర్ షోలు గ్రాండ్ లెవెల్లో డిసెంబర్ 4న థియేటర్లలో పడ్డాయి. అంతక ముందు ఈ సినిమా చూసేందుకు టికెట్లు బుకింగ్ చేసుకున్న అభిమానులు, ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు తీశారు. ముఖ్యంగా బన్నీ ఫ్యాన్స్ అయితే థియేటర్లకు పరుగులే పరుగులు. Also Read: ముంబయి కోర్టు సంచలన తీర్పు.. 8 మంది పాకిస్థానీయులకు 20 ఏళ్ల జైలుశిక్ష.. ఇందులో భాగంగానే రెండు తెలుగు రాష్ట్రాల్లోని సినీ ప్రియులు థియేటర్లకు చేరుకున్నారు. దీంతో థియేటర్ల వద్ద గందరగోళం ఏర్పడింది. అదే సమయంలో థియేటర్ల వద్ద ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు సైతం భారీ బందోబస్తుతో అక్కడకు చేరుకున్నారు. Also Read: మన ఆఫీసులో పులిగారున్నారు..మీరు ఇంటి నుంచే పని చేయండి! #WATCH | Telangana: Fans of actor Allu Arjun thronged the Sandhya theatre in Hyderabad ahead of the premiere show of his film 'Pushpa 2: The Rule' tonight. Police resorted to mild lathicharge to control the crowd. pic.twitter.com/jhRvfB7D3m — ANI (@ANI) December 4, 2024 Also Read: కొత్త సంవత్సరం మొదటి రోజే..తల్లి,నలుగురు చెల్లెళ్లను చంపేసిన కిరాతకుడు! ఇక ఏది జరగకూడదు అని అనుకున్నారో సరిగ్గా అదే జరిగింది. హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద స్వల్ప లాఠీ ఛార్జ్ జరిగింది. ప్రీమియర్ షో చూసేందుకు బన్నీ తన ఫ్యామిలీతో ఆ థియేటర్‌కు వస్తాడని ముందుగానే తెలిసింది. దీంతో బన్నీని చూసేందుకు అభిమానులు భారీగా అక్కడకి తరలివచ్చారు. దీంతో థియేటర్ వద్ద గందరగోళం ఏర్పడింది. వారిని అదుపు చేసేందుకు పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేశారు. అందుకు సంబంధించిన వీడియోలు సైతం నెట్టింట వైరల్ అయ్యాయి. ఇప్పుడు అదే విషయంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ పోలీసులపై చర్యలకు ఆదేశించింది.