/rtv/media/media_files/2025/08/02/konda-surekha-2025-08-02-17-33-30.jpg)
మంత్రి కొండా సురేఖకు బిగ్‌షాక్ తగిలింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వేసిన పరువునష్టం దావా కేసులో మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు శనివారం ఆదేశాలు జారీ చేసింది. ప్రాథమిక సాక్ష్యాలను పరిశీలించిన నేపథ్యంలో కొండా సురేఖపై 2025 ఆగస్టు21 లోపు క్రిమినల్ కేసు నమోదు చేసి నోటీసు జారీ చేయాలంది కోర్టు. కేటీఆర్ పైన కొండా సురేఖ నిరాధారమైన ఆరోపణలు చేశారన్న కేటీఆర్ న్యాయవాది వాదనలతో కోర్టు ఏకీభవించింది.
మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశం.@KTRBRS గారు వేసిన పరువు నష్టం దావా కేసులో క్రిమినల్ కేసుకు ఆదేశం
— Jagan Reddy (@JaganReddyBRS) August 2, 2025
కేటీఆర్‌పైన కొండా సురేఖ నిరాధారమైన ఆరోపణలు చేశారన్న కేటీఆర్ తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన కోర్టు.
ఫిర్యాదుతోపాటు సాక్ష్యుల…
ఫిర్యాదుతో పాటు సాక్ష్యుల వాంగ్మూలాలు, డాక్యుమెంట్ల పరిశీలించిన తర్వాత, కొండా సురేఖపై ప్రాథమిక కేసు ఉన్నట్టు గుర్తించింది కోర్టు. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ తో పాటు సమంత విడాకుల వ్యవహారంలో కేటీఆర్ పై నిరాధార ఆరోపణలు చేసిన కొండా సురేఖ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు పోలీసులను ఆదేశించింది. కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావాను BNS సెక్షన్ 356 కింద పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం, కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేసి, ఈ నెల 21 లోపు సురేఖకు నోటీసు జారీ చేయాలని ఆదేశించింది. కొండా సరేఖ తరుపు న్యాయవాది వ్యక్తం చేసిన అభ్యంతరాలను కోర్టు పట్టించుకోలేదు. కేటీఆర్ చేసిన ఫిర్యాదు ఊహాగానాల ఆధారంగా ఉందని, సరైన సమాచారం లేదని, ఫిర్యాదు చేసిన పోలీస్ స్టేషన్ పరిధి తదితర అంశాలపై వారు లేవనెత్తిన అంశాలను కోర్టు తోసిపుచ్చింది. కొండా సురేఖ చేసిన ఆరోపణలు నిరాధారంగా ఉన్నాయని కేటీఆర్ తరపు న్యాయవాది సిద్ధార్థ్ చేసిన వాదనతో ఏకీభవించిన కోర్టు, ఆమెపై కేసు నమోదు చేయవచ్చని తేల్చిచెప్పింది.
Also Read : Snake Bite: తల్లిని కాటేసిన పాము.. వీపుపై 5 కిలోమీటర్లు మోసుకెళ్లిన కూతురు.. కన్నీళ్లు పెట్టించే వీడియో
నాగచైతన్య, సమంతల విడాకులకు కేటీఆర్ కారణమని
కాగా మంత్రి కొండా సురేఖ, కేటీఆర్‌పై గతంలో సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యంగా, నాగచైతన్య, సమంతల విడాకులకు కేటీఆర్ కారణమని, కేటీఆర్ డ్రగ్స్ అలవాటుకు బానిసని, డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తారని ఆరోపించారు. ఈ ఆరోపణలు తన ప్రతిష్టకు భంగం కలిగించాయని పేర్కొంటూ, కేటీఆర్ కొండా సురేఖకు లీగల్ నోటీసు పంపించారు. తన ఆరోపణలను వెనక్కి తీసుకొని, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే, కొండా సురేఖ దీనికి స్పందించలేదు. దీంతో కేటీఆర్ కోర్టులో క్రిమినల్ పరువు నష్టం దావా కేసు దాఖలు చేశారు.
Also Read : HYD Crime: ఆంటీతో భర్త రొమాన్స్.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాదిన భార్య..!
nampally-court | minister-konda-surekha | latest telangana news | latest-telugu-news | telugu-news