/rtv/media/media_files/2025/08/02/hyderabad-gandhamguda-wife-caught-her-husband-red-handed-with-another-woman-2025-08-02-17-32-49.jpg)
Hyderabad Gandhamguda wife caught her husband red-handed with another woman
ఈ మధ్య కాలంలో అక్రమ సంబంధాల వ్యవహారం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. భార్య లేదా భర్త వేరొకరితో ఇల్లీగల ఎఫైర్ పెట్టుకుని.. ప్రియుడు/ప్రియురాలితో కలిసి హతమార్చుకుంటున్నారు. గతంలో ఈ ఘటనలు ఎక్కడో అరుదుగా జరిగేవి.. కానీ ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. తాజాగా అలాంటిదే మరొక ఘటన తెలంగాణలోని హైదారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
Hyderabad Crime
Hyd లోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో గంధం గూడకు చెందిన ఓ వ్యక్తి పెళ్లైన కొన్నాళ్లు వరకు బాగానే ఉన్నాడు. అయితే ఈ మధ్య కాలంలోనే అతడి ప్రవర్తనలో మార్పులు వచ్చాయి. తరచూ భార్యను కొట్టడం చేసేవాడు. కారణం లేకపోయినా.. ఆమెను వేధించేవాడు. అయితే భర్త ప్రవర్తనలో మార్పు గమనించిన భార్య.. అతడు ఎక్కడెక్కడకు వెళ్తు్న్నాడో నిఘా పెట్టింది. ఈ క్రమంలోనే అతడు వేరొక మహిళ ఇంట్లోకి వెళ్లడం గమనించింది. దీంతో వెంటనే పోలీసులను పిలిచి భర్తతో పాటు, అతడి ప్రియురాలిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read : నాకేం తెలియదు...విచారణలో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన డాక్టర్ నమ్రత
Also Read : ‘ఫాల్కన్’ కు బిగ్ షాక్.. రూ.18 కోట్ల ఆస్తులు జప్తు
గంధం గూడకు చెందిన వేణుకుమార్ అనే వ్యక్తికి 13 ఏళ్ల క్రితం శిరీష అనే మహిళతో వివాహం జరిగింది. వేణు కొన్నాళ్లు తన భార్యతో హ్యాపీగా జీవించాడు. కానీ గత రెండేళ్ల క్రితం అతడికి వేరొక మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలోనే వేణు కుమార్ తరచూ తన-- భార్యను కొడుతూ, తిడుతూ నిత్యం వేధింపులకు గురి చేశాడు.
దీంతో భర్త ప్రవర్తనలో మార్పు రావడంతో భార్య శిరీష్ వేణుకుమార్‌పై నిఘా పెట్టింది. తన భర్త ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవరిని కలుస్తున్నాడో తెలుసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే వేణుకుమార్ తన భార్యకు చెప్పకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అదే సరైన సమయంగా భావించిన శిరీష.. తన భర్త ఎక్కడకి వెళ్తున్నాడో తెలుసుకునేందుకు అతడి వెంట రహస్యంగా వెళ్లింది.
వేణుకుమార్ గంధం గూడలోనే ఒక అపార్ట్‌మెంట్‌కు వెళ్లడాన్ని శిరీష గుర్తించింది. అతడు ఆ అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లడంతో శిరీష్ వెంటనే అక్కడకు చేరుకుంది. అదే సమయంలో నార్సింగి పోలీసులకు సమాచారం అందించింది. అనంతరం పోలీసులు వచ్చేలోపే ఆమె, తన బంధువులతో కలిసి ఆ అపార్ట్‌మెంట్‌లోని తలుపులు పగలుకొట్టింది. తలుపులు బద్దలు కొట్టగానే భర్త వేణుకుమార్ మరో మహిలతో రొమాన్స్ చేస్తూ భార్య శిరీష్ కంటపడ్డాడు.
దీంతో భార్య శిరీష్ కోపంతో.. తన భర్త వేణును, ఆ మహిళను చితకబాదింది. అప్పుడే పోలీసులు అక్కడికి చేరుకుని వేణుకుమార్, అతడి ప్రియురాలిని, అతడి భార్య శిరీషను పోలీస్టేషన్‌కు తరలించారు. ఈ సంఘటనపై శిరీష్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
HYD Crime | telangana crime case | telangana crime news | telangana-crime-updates | latest-telugu-news | telugu-news | Husband And Wife Crime