Nagarjuna Sagar: నిండుకుండలా మారిన నాగార్జునసాగర్ ప్రాజెక్టు
వరద ప్రవాహంతో నాగార్జున సాగర్ నిండుకుండలా మారింది. అధికారులు రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద ఇలాగే కొనసాగితే మరికొన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉన్నట్లు సమాచారం.
వరద ప్రవాహంతో నాగార్జున సాగర్ నిండుకుండలా మారింది. అధికారులు రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద ఇలాగే కొనసాగితే మరికొన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉన్నట్లు సమాచారం.
నల్లగొండ జిల్లా ప్రభుత్వాస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. డాక్టర్ నిర్లక్ష్యానికి నిండు గర్భిణి ఆమె కూర్చున్న కుర్చీలోనే ప్రసవించింది. గర్భిణి అశ్వినిని పరిశీలించిన వైద్యులు ప్రసవానికి ఇంకా సమయం ఉందన్నారు. ఆమెకు బెడ్ కేటాయించకపోవడంతో కూర్చున్న కుర్చీలోనే ప్రసవించింది.
TG: సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైతు రుణమాఫీపై మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. దీంతో ఇరు పార్టీల నేతలు రాళ్లు, కోడి గుడ్లతో దాడి చేసుకున్నారు.
ఆన్లైన్ బెట్టింగ్‌లో మోసపోయిన మరో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నల్గొండ జిల్లా నెహ్రూ నగర్‌కు చెందిన సాయికుమార్ వంద రూపాలతో మొదలుపెట్టిన ఆట రూ.2 కోట్ల అప్పులకు చేరడంతో సాగర్ ఎడమ కాల్వలో దూకి చనిపోయాడు. సూసైడ్ కారణాలను సెల్ఫీ వీడియోలో వివరించాడు.
మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిని వ్యవసాయ శాఖ సలహాదారుడిగా రేవంత్ సర్కార్ నియమించింది. కేబినెట్ హోదాను సైతం కల్పించింది. గుత్తా అమిత్ రెడ్డిని డెయిరీ కోఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్ గా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తండ్రి వెంకన్నపై ప్రత్యర్థులు దాడి చేస్తుండగా చూసి తట్టుకోలెక గుండె పోటుకు గురై చనిపోయిన చిన్నారి పావని కుటుంబ సభ్యులను మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి పరామర్శించారు. సూర్యాపేట జిల్లా నాగారం మండలం డి.కొత్తపల్లిలోని వారి నివాసానికి వెళ్లి ధైర్యం చెప్పారు. అండగా ఉంటామని భరోసానిచ్చారు.
తెలంగాణ సూర్యపేటజిల్లాలో కుటుంబ కక్షలు ఓ చిన్నారి ప్రాణం తీశాయి. తల్లిదండ్రులపై బంధువులు దాడి చేస్తుంటే 'మా నాన్నను చంపొద్దు' అంటూ కాళ్లవేళ్లాపడిన చిన్నారి పావని భయంతో గుండెపగిలి ఇంట్లోనే చనిపోయింది. ఈ ఘటన స్థానికులను కలిచివేయగా.. కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
భార్యను హత్య చేసేశాడు. ఎవ్వరికీ అనుమానం రాకూడదని అంబులెన్స్ ను పిలిచి ఆసుపత్రికి తీసుకెళ్ళాడు. కానీ అక్కడ డాక్టర్లు ఆమె మెడ మీదున్న గాయలను చూసి పోలీసులకు కంప్లైంట్ చేయడంతో సదరు భర్త బండారం బయటపడింది.
సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్‌పై బదిలీ వేటు వేసింది. మరికొందరు అధికారులను సస్పెండ్ చేసింది. నిర్మాణ సంస్థ అయిన మేఘా కంపెనీకి కూడా షోకాజ్ నోటీసులు జారీ చేసింది.