TS: డాక్టర్‌ నిర్లక్ష్యం.. కూర్చున్న కుర్చీలోనే ప్రసవించిన గర్భిణి..!

నల్లగొండ జిల్లా ప్రభుత్వాస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. డాక్టర్‌ నిర్లక్ష్యానికి నిండు గర్భిణి ఆమె కూర్చున్న కుర్చీలోనే ప్రసవించింది. గర్భిణి అశ్వినిని పరిశీలించిన వైద్యులు ప్రసవానికి ఇంకా సమయం ఉందన్నారు. ఆమెకు బెడ్ కేటాయించకపోవడంతో కూర్చున్న కుర్చీలోనే ప్రసవించింది.

New Update
TS: డాక్టర్‌ నిర్లక్ష్యం.. కూర్చున్న కుర్చీలోనే ప్రసవించిన గర్భిణి..!

Nalgonda: నల్గొండ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు లేకపోవడంతో ఓ నిండు గర్భిణి తన కుటుంబ సభ్యులతో కలిసి నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్ళింది. అయితే, అక్కడ బెడ్ ఇవ్వకపోవడంతో కూర్చున్న కుర్చీలోనే ప్రసవించింది. వివరాల్లోకి వెళితే.. నేరేడుగోమ్మ మండలానికి చెందిన అశ్వినీ పురిటి నొప్పులతో గత అర్ధరాత్రి దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లింది.

Also Read: దారుణం.. జువైనల్ హోమ్‌లో ఉండే బాలికపై అత్యాచారం.!

అక్కడ వైద్యులు లేకపోవడంతో, నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అశ్వినిని పరిశీలించి ప్రసవానికి ఇంకా సమయం ఉందని చెప్పారు. గర్భిణికి బెడ్ కల్పించకపోవడంతో ఆమె ఓ  కుర్చీలో కుర్చుంది. అయితే, ఆమెకు రక్తస్రావం రావడంతో కూర్చున్న కుర్చీలోనే గర్భిణి ప్రసవించింది. దీంతో వైద్య సిబ్బందిపై గర్భిణి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు