Online Betting: మరో యువకుడి ప్రాణంతీసిన ఆన్లైన్ బెట్టింగ్.. వందతో మొదలై రెండు కోట్లకు చేరి! ఆన్లైన్ బెట్టింగ్‌లో మోసపోయిన మరో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నల్గొండ జిల్లా నెహ్రూ నగర్కు చెందిన సాయికుమార్ వంద రూపాలతో మొదలుపెట్టిన ఆట రూ.2 కోట్ల అప్పులకు చేరడంతో సాగర్ ఎడమ కాల్వలో దూకి చనిపోయాడు. సూసైడ్ కారణాలను సెల్ఫీ వీడియోలో వివరించాడు. By srinivas 20 Aug 2024 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి Online Betting : ఆన్లైన్ బెట్టింగ్ మరో యువకుడి ప్రాణం తీసింది. ఈజీ మనీకి అలవాటు పడ్డ యువకుడు తక్కువ సమయంలో కోట్లు సంపాదించాలనే ఆశతో ఉన్నదంతా ఊడ్చిపెట్టి చివరకు ఆత్మ హత్యకు పాల్పడ్డాడు. వంద రూపాయలతో మొదలు పెట్టిన బెట్టింగ్ మొదట్లో భారీగా ఆశ చూపడంతో అలాగే కంటిన్యూ చేశాడు. అలా నెమ్మదిగా రెండు కోట్ల అప్పు వరకూ వెళ్లడంతో దిక్కుతోచని పరిస్థితిలో తనువు చాలించాడు. ఈ ఘటన నల్గొండ మున్సిపాలిటీలోని నెహ్రూ నగర్లో చోటుచేసుకోగా వివరాలు ఇలా ఉన్నాయి. వందతో మొదలై రెండు కోట్ల అప్పులు.. ఈ మేరకు నెహ్రూ నగర్కు చెందిన సాయికుమార్ అనే యువకుడు కొంతకాలంగా ఆన్ లైన్ బెట్టింగ్ కు అలవాటుపడ్డాడు. వంద రూపాయలతో మొదలుపెట్టగా అంతకు డబుల్ రావడంతో మరింత పెట్టుబడి పెట్టాడు. అలా వందల నుంచి ఏకంగా తన బెట్టింగ్ కోట్ల రూపాయలకు చేరింది. అయితే కొత్తలో ఆశ చూపిన కేటుగాళ్లు తర్వాత జేబు గుళ్ల చేశారు. దీంతో మళ్లీ లక్ తగులుతుందనే ఆశ, పోయిన డబ్బులు తిరిగి తెచ్చుకోవాలనే తపనతో ఏకధాటిగా బెట్టింగ్ పెడుతూ రెండు కోట్ల రూపాయలు అప్పులు చేశాడు. ఈ క్రమంలో చేతిలో డబ్బులు అయిపోవడంతోపాటు చేసిన అప్పులు తీర్చలేక సాగర్ ఎడమ కాల్వలో దూకి చనిపోయాడు. తన బాధను మొత్తం సెల్ఫీ వీడియో తీసి పోస్ట్ చేయడం విశేషం. ఇది కూడా చదవండి: TG News: విగ్రహ వివాదం వేళ సచివాలయంలో ఆసక్తికర పరిణామం.. స్వయంగా రంగంలోకి సీఎం! అయితే ఈ బెట్టింగ్ వెబ్ సైట్లు మన ఈమెయిల్ ఐడీలు, ఫోన్ నంబర్ లను మరిన్ని వెబ్ సైట్లకు అమ్ముకుంటాయి. ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ నిర్వహించే సైబర్ నేరగాళ్లు వీటిని కొనుక్కుంటారు. ఆ నంబర్లకు, టెలిగ్రాం, వాట్సాప్ లో ఆన్ లైన్లో డబ్బు సంపాదించే ప్లాట్ ఫామ్ కు ఎంపిక అయ్యారంటూ లింక్ పంపిస్తారు. దీంట్లో ఎంత పెడితే ఎంత డబ్బు వస్తుందనే వివరాలు అందిస్తారు. అలా 100 రూపాయల నుంచి లక్షల్లో డిపాజిట్ చేయవచ్చు. క్యాసినో, రమ్మి, తీన్ పత్తి, లక్కీ 777, ఏవియేటర్ వంటి దాదాపు 2 వేలకు పైగా ఆన్ లైన్ బెట్టింగ్ లున్నాయి. #online-betting-game #sai-kumar-sucide #nalgonda మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి