Suryapet: తెలంగాణ జిల్లా సూర్యాపేటలో జరిగిందీ సంఘటన. సూర్యాపేటలో చిలుకూరు మండలానికి చెందిన దాసోజు బ్రహ్మచారి 2014లో నకిరేకల్ మండలం కడపర్తి గ్రామానికి చెందిన సరితను ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ బ్రహ్మచారికి మద్యం అలవాటు ఉంది. ఈ కారణంగా భార్యభర్తలు గొడవలు పడుతూ ఉండేవారు. బుధవారం ఉదయం బ్రహ్మచారి భార్య నిద్ర లేవడం లేదని బంధువులకు చెప్పాడు. తరువాత అంబులెన్స్ ను పిలిచి ఆసుపత్రికి కూడా తీసుకెళ్ళాడు. అయితే సరి అప్పటికే మృతి చెందింది.
పూర్తిగా చదవండి..Telangana: కట్టుకున్నదాన్ని చంపేసి..అనారోగ్యం అని నాటకం
భార్యను హత్య చేసేశాడు. ఎవ్వరికీ అనుమానం రాకూడదని అంబులెన్స్ ను పిలిచి ఆసుపత్రికి తీసుకెళ్ళాడు. కానీ అక్కడ డాక్టర్లు ఆమె మెడ మీదున్న గాయలను చూసి పోలీసులకు కంప్లైంట్ చేయడంతో సదరు భర్త బండారం బయటపడింది.
Translate this News: