/rtv/media/media_files/2025/01/21/r32wN0gh491QX7Ovn4CW.jpg)
Nalgonda BRS-Congress fight
BRS: నల్గొండలో జిల్లాకేంద్రంలోని మున్సిపల్ ఆఫీస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్ఎస్ చేపట్టిన రైతు మహాదర్నా అంశంలో కాంగ్రెస్-బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. దీంతో పరస్పరం కుర్చీలు విసురుకుని ఫర్నీచర్ ధ్వంసం చేసిన కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు.. గొడవకు దిగిన బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు.
ఫ్లెక్సీలు తొలిగించి రచ్చ..
ఈ మేరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన రైతు మహాధర్నా విజయవంతం చేయాలని కోరుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో వాటిని ముందస్తు సమాచారం ఇవ్వకుండా గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు. ఈ క్రమంలో అధికార పార్టీ కార్యకర్తలు మున్సిపల్ కమిషనర్ లా ఓవర్ చేస్తున్నారంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికార బలంతో చెత్త రాజకీయాలు చేస్తుందన్నారు. నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ ఛాంబర్లో నిరసనగా బైఠాయించారు. వారందరినీ బయటకు పంపించేందుకు పోలీసులు ప్రయత్నించగా మాజీ ఎమ్మెల్యేతో పాటు పార్టీ శ్రేణులు పోలీసుల మాట వినలేదు. బలవంతంగా వారందరినీ బయటకు పంపించారు.
ఇది కూడా చదవండి: పుష్ప అంటే బ్రాండ్ అనుకుంటివా.. కాదు బ్యాడ్‌లక్..! ఇది మూడో దెబ్బ
ఇదిలా ఉంటే.. జనవరి 21న జరగాల్సిన మహాధర్నాకు అనుమతి రద్దయింది. పోలీసుల నిర్ణయంతో బీఆర్ఎస్ నాయకత్వం హైకోర్టును ఆశ్రయించినప్పటికీ కోర్టు అనుమతి ఇవ్వకపోవడంతో ధర్నాను వాయిదా వేసుకున్నారు. నల్గొండ టౌన్ లోని క్లాక్ టవర్ సెంటర్ వద్ద ధర్నా నిర్వహించడానికి బీఆర్ఎస్ ఏర్పాట్లు చేయగా ట్రాఫిక్ ఇబ్బంది కారణంగా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో రేవంత్ సర్కార్ హామీల అమలుపై ప్రశ్నించే కార్యక్రమాన్ని నిలిపివేసేందుకు కుట్ర అని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.