/rtv/media/media_files/2025/01/21/xkeL36X0pKZuOIOpcnKS.jpg)
pushpa -2 Photograph: (pushpa -2)
‘పుష్పా అంటే బ్రాండ్.. ఇది సార్ నా బ్రాండ్’ అనే డైలాగ్ పుష్పా-2 మూవీలో ఉంటుంది. అయితే ఇప్పుడు పుష్పా అంటే బ్రాండ్ కాదు బ్యాడ్‌లక్ అన్నట్టుగా ఉంది. ఆ పేరుకే శని పట్టుకుందన్నట్టుగా అనిపిస్తోంది. పుష్పా సినిమాలో నటించిన హీరో, డైరెక్టర్, నిర్మాతలపై వరసగా విమర్శలకు గురౌతున్నారు. తాజాగా పుష్పా -2 నిర్మాతల ఇంట్లో ఇన్‌కం ట్యాక్స్ అధికారులు సోదాలు చేశారు. ఆ సినిమా తీసిన మైత్రీ మూవీ మేకర్స్‌కు ఐటీ ఆఫీసర్లు షాక్ ఇచ్చారు. మంగళవారం ఉదయం ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు ఇళ్లు, ఆఫీసులపై కూడా 8చోట్ల ఐటీ అధికారులు రైడ్స్ చేశారు.
Read also: IIT baba: ఐఐటీ బాబాను బహిష్కరించిన సొంత అఖాడా.. అసలు కారణం ఏంటంటే!
తెలంగాణ రాష్ట్రంలో ప్రీమియర్ షోలకు పర్మిషన్ ఇవ్వమని నిర్ణయం తీసుకుంది. పుష్పా 2 మూవీలో సంధ్యా థియేటర్ ఘటనలో ఓ మహిళా అభిమాని తొక్కిసలాటలో చనిపోయింది. అల్లు అర్జున్ ప్రిమియర్ షో మూవీ చూద్దామని ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్యా థియేటర్‌కు వెళ్లారు. పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి రావడంతో రేవతి అనే మహిళ తొక్కిసలాటలో చనిపోయింది. ఆమె కొడుకు కోమాలోకి వెళ్లాడు. ఇది పుష్పా-2 మూవీకి పెద్ద గండంలా మారింది. తర్వాత అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారు.
సంధ్యా థియేటర్ తొక్కిసలాట, బన్నీ అరెస్ట్, ఇప్పుడు ఇది
తెలంగాణ ప్రభుత్వానికి బన్నీకి మధ్య పెద్ద వివాదం జరిగింది. దిల్ రాజు కలుగజేసుకొని మాటర్‌ను క్లియర్ చేశారు. సినీ ఇండస్ట్రీ పెద్దలు అందరూ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. పుష్పా 2 సినిమాకే వరుసగా ఇది మూడో గండం. ఫస్ట్ సంధ్యా థియేటర్ తొక్కిసలాట, తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్.. ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్‌పై ఐటీ రైడ్స్ ఇలా వరుసగా పుష్పా-2 కి దెబ్బలు పడుతునే ఉన్నాయి.
Read also: ఐటీ సోదాల్లో బిగ్ ట్విస్ట్.. దిల్ రాజు సతీమణితో బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేయించిన అధికారులు!
2015లో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ స్థాపించారు. నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి ముగ్గురు నిర్మాతలు కలిసి దీన్ని ఏర్పాటు చేశారు. పుష్ప 2 క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కించింది మైత్రి మూవీ మేకర్స్. ఈ సినిమా కోసం దాదాపు 500 కోట్ల బడ్జెట్‌ను వెచ్చించినట్లు ఇండస్ట్రీ టాక్. భారీ అంచనాలతో డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో విడుదలైంది పుష్ప 2.
తొలి రోజే రూ. 294 కోట్ల ఓపెనింగ్స్ సాధించి ట్రేడ్ వర్గాలనే ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించి.. రికార్డు స్థాయిలో కలెక్షన్లు వసూలు చేసింది. ఆర్ఆర్ ఆర్, కల్కి, బాహుబలి 2 వంటి భారీ బ్లాక్ బస్టర్ ఇట్ సినిమాల రికార్డులను సైతం అల్లు అర్జున్ పుష్ప 2 బ్రేక్ చేసింది. అలాగే..ఇటీవల సంక్రాంతి కానుకగా పుష్ప 2లో 20 నిమిషాల ఫుటేజీతో రీలోడెడ్ వెర్షన్ పేరిట రిలీజ్ చేసింది మైత్రీ మూవీ మేకర్స్. ఇలా పుష్ప 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ. 1850 కోట్లను వసూలు చేసి నయా రికార్డులను క్రియేట్ చేసింది. దీంతో ఐటీ అధికారులు టాలీవుడ్‌లో బాడా బాబు ఇండ్లపై జనవరి 21న ఐటీ దాడులు చేసింది.