Telangana: విషాదం.. తల్లి,కొడుకు దుర్మరణం

నాగర్‌కర్నూల్‌ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కరెంట్‌ షాక్‌తో తల్లి, కొడుకు మృతి చెందడం కలకలం రేపింది. తాడూర్ మండలం తుమ్మల సాగర్‌ గ్రామంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది.

New Update
Crime

Crime

నాగర్‌కర్నూల్‌ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కరెంట్‌ షాక్‌తో తల్లి, కొడుకు మృతి చెందడం కలకలం రేపింది. తాడూర్ మండలం తుమ్మల సాగర్‌ గ్రామంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. గ్రామంలోని జయమ్మ (38) తన కుటుంబంతో కలిసి ఉంటోంది. ఆమెకు కొడుకు శ్రీకాంత్‌(15), కూతురు ఉన్నారు. వీళ్లకి పిండి గిర్నీ ఉంది. 

Also Read: పాక్‌కు మరో BIG షాక్: 1971లో ఇందిరమ్మ చేసింది.. ఇప్పుడు మోదీ చేయబోతున్నారా..?

అయితే గురువారం శ్రీకాంత్‌ పిండి గిర్నిని స్టార్ట్‌ చేశాడు. ఈ క్రమంలోనే అతడు కరెంట్‌ షాక్‌కు గురయ్యాడు. షాక్‌తో విలవిలలాడుతుండగా అతడి తల్లి గమనించింది. కొడుకును కాపాడేందుకు వెళ్లి ఆమె కూడా కరెంట్‌ షాక్‌కు గురైంది. దీంతో వీళ్లద్దరినీ దూరం నుంచి గమనించిన కూతురు వెంటనే కరెంట్‌ మీటర్‌ను ఆఫ్‌ చేసింది. కానీ అప్పటికే ప్రమాదం జరిగిపోయింది.

Also Read: కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. జనన, మరణ రికార్డులతో ఓటర్ల జాబితా అనుసంధానం

అక్కడిక్కడే తల్లి జయమ్మ మృతి చెందింది. కొడుకు శ్రీకాంత్ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. దీంతో అతడి కుటుంబ సభ్యులు అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. కానీ అంబులెన్స్‌ వచ్చేసరికి శ్రీకాంత్ కూడా మరణించాడు. తల్లి, కొడుకు ఒకేసారి మృతి చెందడంతో వాళ్ల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. స్థానికుల ఫిర్యాదుల మేరకు పోలీసులు మృతదేహాలను నాగర్‌ కర్నూల్‌ జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పోలీసులు కేసు నమోదు చేసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.    

Also Read: కర్రెగుట్టలపై సాయుధ బలగాలు.. మావోయిస్టులు ఎక్కడికెళ్లారంటే ?

telugu-news | national-news | rtv-news | crime 

Advertisment
తాజా కథనాలు