Ap Rains: ఏపీ పై అల్పపీడనం ఎఫెక్ట్‌..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప­పీడనం స్థిరంగా కొనసాగు­తోంది. ఈ ప్రభావంతో బుధవారం నుంచి శుక్రవారం వరకు కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

New Update
rains

Ap Rains: ఆగ్నేయ బంగాళాఖాతంలోని అల్పపీడనం ప్రభావంతో ఏపీలో వర్షాలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీంతో నేడు కాకినాడ, అనంతపురం, శ్రీ సత్యసాయిడాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, అల్లూరి సీతారామరాజు, నెల్లూరు, కర్నూలు,నంద్యాల, , కడప జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. బుధవారం నుంచి శుక్రవారం వరకు కోస్తా, రాయలసీమలో  అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని అధికారులు చెప్పారు.

Also Read: Ap: ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌...క్రిస్మస్‌,సంక్రాంతి కానుకలు!

రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని.. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాలలో దాచాలని.. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో రెండు రోజుల క్రితం అల్పపీడనం ఏర్పడింది.  ప్రస్తుతం అది స్థిరంగా కొనసాగుతోంది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి మంగళవారం నాటికి తీవ్ర అల్పపీడనంగా బలపడనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. బుధవారం నాటికి నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించి శ్రీలంక, తమిళనాడు తీరం దిశగా వస్తుందని భావిస్తున్నారు. 

Also Read: ఇజ్రాయెల్‌ను చూసి మనం నేర్చుకోవాలి.. సీఎం హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు

ఈ ప్రభావం ఏపీపై కూడా ఉండనుందని తెలుస్తుంది. ఈ నెల 13 వరకు అక్కడక్కడ భారీవర్షాలకు అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. బంగాళాఖాతంలో వరుసగా అల్పపీడనాలు, తుఫాన్లు ఏర్పడుతున్నాయి. గత నెలలో ఒక తుఫాన్ ఏర్పడగా.. మరోసారి ఇప్పుడు‌ అల్పపీడనం గా సాగుతుంది.

Also Read: 11 లక్షల 70 వేలమంది బడి మానేశారు..ఎక్కువగా ఎక్కడ అంటే?

ఈనెల 14న లేదా 15న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయని అధికారులు చెప్పారు. ఏపీకి వర్ష సూచనతో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. కోతకి సిద్ధంగా ఉన్న వరి పంటని వర్షాలకు ముందు కోయోద్దని.. కోసినా పూర్తిగా ఆరని పనలను వర్షాల కురుస్తుండటంతో కుప్పలు వేసేటప్పుడు ఎకరాకు 25 కిలోల ఉప్పును పనలపై చల్లుకుంటూ కుప్పవేసుకోవడం వల్ల నష్ట శాతాన్ని నివారించవచ్చని అంటున్నారు.

Also Read: HYD: మనిషివా..మోహన్ బాబువా..సీనియర్ జర్నలిస్ట్ రవిప్రకాష్ ఆగ్రహం

అలాగే ఉప్పు ద్రావణాన్ని పనలపై పడే విధంగా పిచికారీ చేయాలని.. కోత కోసి పొలంలో ఉన్న పనలు వర్షానికి తడిస్తే గింజలు మొలకెత్తకుండా ఉండడానికి ఇలా చేయడం మంచిదని అధికారులు అంటున్నారు. పంట పొలాల్లో నిలిచే అదనపు నీరు  బయటకు పోయేలా రైతులు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు