/rtv/media/media_files/2024/12/11/taqq9RTGq4bsd8Mr0E05.jpg)
Bengalore: ఆ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పేరు అతుల్ సుభాష్. బెంగళూరు మంచి పేరున్న కంపెనీలో పని చేస్తున్నాడు. యూపీ నివాసి అయిన అతుల్ ఆత్మహత్య చేసుకున్నాడు.కానీ దాని కంటే ముందు అతను 40 పేజీల సూసైడ్ నోట్ గంటన్నర పాటు ఉన్న వీడియోను ఒకదానిని ప్రజల ముందుకు తీసుకుని వచ్చాడు. అందులో తన భార్యతో పాటు కుటుంబ సభ్యులు తనని వేధిస్తున్నారని తప్పుడు కేసులు కూడా పెట్టినట్లు వివరించాడు.
Also Read: మోహన్ బాబుకు బిగ్ షాక్.. పద్మశ్రీ రద్దు?
అతను రాసిన సూసైడ్ నోట్‌లో నేను నా భార్యకు డబ్బును ఇవ్వడానికి ఒప్పుకోలేదు..వారికి డబ్బులు ఇవ్వడం కంటే నేను చచ్చిపోవడమే మేలని భావిస్తున్నాను . ఎందుకంటే నా డబ్బును నా ప్రత్యర్థులు దుర్వినియోగం చేసి నా కుటుంబాన్ని వేధిస్తారని నాకు ముందే తెలుసు. అందుకే నేను వారికి డబ్బులు ఇవ్వాలని అనుకోవడం లేదు.
Also Read: Lion: సింహం వేట చూసి ఉంటారు...అది ప్రేమిస్తే ఇలాగే ఉంటది
తన భార్య తనపై అనేక కేసులు పెట్టిందని, ఇప్పుడు రూ.3 కోట్లు డిమాండ్ చేస్తోందని అతుల్ సుభాష్ ఆరోపించారు. అతుల్ సుభాష్ బెంగళూరు నగరంలోని మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)లో డీజీఎంగా పనిచేస్తున్నారు. ఆత్మహత్య సమయంలో అతుల్ ధరించిన టీషర్ట్‌పై జస్టిస్ ఈజ్ డ్యూ అని రాసి ఉంది.
Also Read: BIG BREAKING : మా నాన్న దేవుడు.. మీడియాకి మంచు మనోజ్ క్షమాపణలు
డిసెంబర్ 9న అతను రంబుల్ అనే ఒక యాప్ లో ఒక వీడియోని పోస్ట్ చేశాడు. అది దాదాపు గంటన్నర నిడివి కలిగివుంది. తన భార్య, ఆమె కుటుంబం కారణంగానే తాను ఈ ఆత్మహత్య నిర్ణయం తీసుకుంటున్నట్లు వివరించాడు సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్న తన భార్య, తనపై 9 బోగస్ కేసులు పెట్టిందనీ, మెయింటెనెన్స్ కోసం ఏకంగా రూ.3 కోట్లు అడుగుతోందని అతను ఆ వీడియోలో చెప్పాడు.
TW : SUICIDE : BANGALORE
— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) December 10, 2024
◾Atul Subhash, 34 year old
◾Got married in 2019
◾Driven to suicide by wife, in-laws, biased laws & system within 5 years
◾Left 1.5 hr suicide video, 40 page note
◾Wife demanded 3 Crores Alimony
◾Wife didn't let him even see the face of his child… pic.twitter.com/zDoSjD9CKN
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అతుల్.. ఒక ఎన్జీవో వాట్సాప్ గ్రూపులో ఒక మెసేజ్ పెట్టాడు. అది గృహహింస వేధింపుల అంశాలకు సంబంధించినది. తన ఆత్మహత్య నిర్ణయం గురించి కూడా చెప్పాడు. దీని ప్రకారం అతను తీవ్రమైన నిరాశలో ఉన్నట్లు తెలిసింది. మంగళవారం.. వాట్సాప్ గ్రూపులో ఒక వ్యక్తి ఈ మెసేజ్ చదివి, పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు సుభాష్ నివసిస్తున్న ప్రాంతానికి వెళ్లేసరికి.. అతని మృతదేహం ఉరికి వేలాడుతూ ఉంది.
అతను వేసుకున్న టీ షర్ట్ పై న్యాయం జరగాలి అని రాసివుంది. అక్కడ పోలీసులు కొన్ని A4 షీట్లను స్వాధీనం చేసుకున్నారు. వాటి ప్రకారం అతను కొన్ని కోర్టు కేసులను ఎదుర్కొంటున్నాడని సమాచారం.
Also Read: Diabetic: ఈ అలవాట్లతో రెట్టింపు ప్రమాదం..మానుకోకపోతే అంతే సంగతి
అయితే అతుల్ ఆత్మహత్య కి ముందు.. ఏమేం చెయ్యాలనుకున్నాడో అవన్నీ ఒక లిస్ట్ రాసుకున్నాడు. దానికి ముక్తికి ముందు చెయ్యాల్సినవి అంటూ ఓ హెడ్డింగ్ కూడా పెట్టాడు. ఆ లిస్టును రూంలోని కబోర్డుకి అంటించాడు. అందులో అతని సూసైడ్ నోట్ ఎక్కడ ఉంచిందీ కూడా రాసాడు. అంతేకాకుండా ఆత్మహత్య చేసుకునే ముందు స్నానం చేయాలని, వందసార్లు శివనామస్మరణ కూడా చేసినట్లు తెలిపాడు. అలాగే.. రెండ్రోజుల్లో పూర్తి చేసిన పనులు, చెయ్యాల్సిన పనులను కూడా ఆ లెటర్లో రాసి ఉంచాడని పోలీసులు తెలిపారు.
పెళ్లి తర్వాత.. అతుల్ సుభాష్ భార్య.. ఉత్తరప్రదేశ్ లోని జాన్పూర్ నుంచి బెంగళూరుకి వచ్చేసింది. తర్వాత వరకట్న వేధింపుల కేసు, గృహహింస కేసును అతనిపై, అతని తల్లిదండ్రులపై పెట్టింది. తన భార్య, అమె కుటుంబ సభ్యుల పేర్లను చెబుతూ సుభాష్.. తన చావుకి ఐదుగురు సభ్యులు బాధ్యులు అని పేర్కొన్నాడు. తన నుంచి భారీగా డబ్బును లాగేందుకు భార్య, ఆమె కుటుంబం భారీ కుట్రకు పాల్పడిందని ఆరోపించాడు. ఇందుకోసం తనపై నకిలీ కేసులు పెట్టిందని తెలిపాడు.
ఇప్పటివరకూ 120 కోర్టు తేదీలు ఖరారు అయ్యాయని, ఈ కేసుల కారణంగానే తాను బెంగళూరు నుంచి జాన్పూర్‌కి 40 సార్లు వెళ్లానని తెలిపాడు. తాను మాత్రమే కాకుండా.. తన పేరెంట్స్, సోదరుడు కూడా కోర్టుకు వెళ్లారని చెప్పాడు. చాలా సందర్భాల్లో కోర్టులో ఏమీ జరగలేదనీ, కొన్నిసార్లు జడ్జి కూడా లేరనీ, మరికొన్నిసార్లు స్ట్రైక్ ఉందని వివరించాడు. విచారణలో రెండు వైపులా వాదన వినిపిస్తూ ఎవరో ఒక లాయర్.. కేసు వాయిదాను అడిగేవారని వివరించాడు.
అతుల్‌కి సంవత్సరానికి 23 సెలవులు మాత్రమే ఉండేవి. తన భార్య కింది కోర్టులో 6 కేసులు, హైకోర్టులో 3 కేసులు ఫైల్ చేసిందనీ, వాటిలో హత్యాత్నం, అసహజ శృంగారం, గృహ హింస, అదనపు కట్నం వంటి కేసులు కూడా ఉన్నాయని తెలిపాడు. ఇలాంటి వాటిలో బెయిల్ లభించడం కూడా కష్టమేనన్న అతుల్.. 2019లో నమోదైన ఓ కేసులో తాను 10లక్షలు కట్నం డిమాండ్ చేసినట్లు ఫైల్ చేశారనీ.. ఆ షాకుతో తన తండ్రి చనిపోయారని తన భార్య కేసు పెట్టిందని అతుల్ తెలిపాడు. విడాకులు ఇవ్వాలంటే.. నెలకు రూ.2లక్షలు భరణం ఆమె డిమాండ్ చేస్తోందనీ, తన పిల్లల్ని కూడా తాను కలవకుండా చేస్తోందని చెప్పాడు
ఇప్పుడు ఈ టెకీ మరణం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. జనరల్‌గా గృహహింసపై మహిళలే కేసులు పెడుతుంటారు. కానీ.. ఇక్కడ అతుల్.. తానే గృహహింసకు బలవుతున్నట్లు తెలిపాడు. ఇప్పుడు కర్ణాటక, యూపీ పోలీసులు ఈ కేసును సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు అతని మరణంపై చాలా మంది స్పందిస్తున్నారు. న్యాయం జరగాలి అనే హ్యాష్ టాగ్‌తో తమ నిరసన తెలియజేస్తున్నారు. ఇది ఇండియాలో పురుషులపై జరుగుతున్న చట్టపరమైన నరమేధం అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టారు.