Kavitha : కవిత యూటర్న్..ఫలించిన శోభమ్మ చర్చలు?

ఎమ్మెల్సీ కవిత ఇంటికి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సతీమణి శోభ వెళ్లారు. బుధవారం రాత్రి ఆమె అల్లుడు, కవిత భర్త అనిల్ పుట్టిన రోజు వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా శోభ తన కూతురు కవితకు కీలకమైన సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది.

New Update
kcr

ఎమ్మెల్సీ కవిత ఇంటికి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సతీమణి శోభ వెళ్లారు. బుధవారం రాత్రి ఆమె అల్లుడు, కవిత భర్త అనిల్ పుట్టిన రోజు వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా శోభ తన కూతురు కవితకు కీలకమైన సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది. కొద్ది రోజులు నిదానంగా ఉండాలని, అన్నీ సర్దుకుంటాయని కవితకు తల్లి భరోసా ఇచ్చినట్లుగా బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కల్వకుంట్ల కుటుంబంలో తీవ్ర విభేదాల వేళ కవిత ఇంటికి కేసీఆర్ భార్య శోభ వెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Also Read : Cyber Fraud: సైబర్ నేరగాళ్ల వలలో జనసేన ఎంపీ.. ఏకంగా రూ.92 లక్షలు ఎలా కొట్టేశారంటే?

కవిత ఆహ్వానించినా 

కవిత కుమారుడి పుట్టిన రోజు వేడుకులకు కూడా శోభ వెళ్లలేదు. సాధారణంగా కవిత కుమారుడి పుట్టినరోజున కవిత ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు. ఈ కార్యక్రమానికి శోభతో పాటు కుటుంబసభ్యులంతా హాజరవుతారు. అయితే ఈ ఏడాది మాత్రం కుటుంబంలో జరిగిన పరిణామాల నేఫథ్యంలో అలా జరగలేదు. తన కుమారుడి బర్త్‌డే కార్యక్రమానికి రావాలని కవిత ఆహ్వానించినా ఆమె తల్లి రాలేదు. అయితే, కొత్త బట్టలు, పూజా సామగ్రి పంపించారని సమాచారం. 

కాగా  మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావు అవినీతికి పాల్పడ్డారని, వారివల్లే కేసీఆర్‌కు అవినీతి మరక అంటిందని ఇటీవల కవిత సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యల తర్వాత ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కేసీఆర్. అనంతరం బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేశారు. తాను కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు వస్తున్న ఊహాగానాలపై కవిత స్పందించారు. ప్రస్తుతం తాను ఏ పార్టీలో చేరడం లేదని, భవిష్యత్తులో ఏం చేయాలనే దానిపై జాగృతి కార్యకర్తలు, మేధావులతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.

Also read : Kanchana 4 Update: లారెన్స్ "కాంచన 4"పై క్రేజీ అప్‌డేట్.. ఈసారి బొమ్మ దద్దరిల్లాల్సిందే!

పార్టీ సభ్యత్వానికి కవిత రాజీనామా చేసినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ఇంకా ఆమోదించలేదు. దీంతో ఆమె తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి రానున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఏం జరుగుతుందో చూడాలి. 

Also Read : MIRAI MOVIE: కార్తిక్ ఘట్టమనేని టెక్నికల్ బ్రిలియన్స్ అరాచకం .. రూ .60 కోట్లతో హాలీవుడ్ రేంజ్‌! గూస్ బంప్స్ అంతే

జైలు నుంచి విడుదలైన తర్వాత కవిత బీసీ రిజర్వేషన్లపై దృష్టి సారించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, అలాగే రాహుల్ గాంధీ వంటి జాతీయ నాయకులను కూడా ఆమె ప్రశ్నించారు. ఈ అంశంపై ఆమె నిరంతరంగా పోరాటం చేస్తున్నారు.

Also Read :  Nepal: నేపాల్‌లో ఉద్రిక్తతలు.. ఏపీకి చెందిన యాత్రికుల బస్సుపై దాడులు

Advertisment
తాజా కథనాలు