Kanchana 4 Update: లారెన్స్ "కాంచన 4"పై క్రేజీ అప్‌డేట్.. ఈసారి బొమ్మ దద్దరిల్లాల్సిందే!

"కాంచన 4" షూటింగ్ ఇప్పటికే సగం షూటింగ్ పూర్తి చేసుకుంది, భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది. లారెన్స్ దర్శకత్వంలో నోరా ఫతేహి, పూజా హెగ్డే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గ్లామర్, హారర్ తో "కాంచన 4" ప్రేక్షకులను అలరించనుంది.

New Update
Kanchana 4

Kanchana 4

Kanchana 4 Update: కోలీవుడ్‌లో హారర్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా పేరు తెచ్చుకున్న సిరీస్ అంటే అది "కాంచన" సిరీస్. లారెన్స్(Raghava Lawrence) దర్శకత్వంలో ఇప్పటికే రిలీజైన మూడు పార్ట్‌లు ప్రేక్షకులను భయపెట్టడంలోనే కాదు, మంచి కలెక్షన్లను కూడా రాబట్టాయి. దీంతో ఇప్పుడు నాల్గవ భాగం అంటే "కాంచన 4" మీద అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

త్వరలో రిలీజ్ డేట్.. 

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగం వరకు పూర్తయ్యిందని సమాచారం. ప్రస్తుతానికి ఇంకా రిలీజ్ డేట్‌ను ఖరారు చేయలేదు కానీ, టీమ్ ఫుల్ స్పీడ్ తో మిగిలిన పనులు పూర్తి చేయాలని చూస్తోంది. రాఘవ లారెన్స్ ఈసారి కూడా డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

Also Read: 'మిరాయ్' సినిమాపై RGV మైండ్ బ్లోయింగ్ ట్వీట్! హాలీవుడ్ రేంజ్ లో

నోరా ఫతేహికి కోలీవుడ్ ఎంట్రీ! (Nora Fatehi in Kanchana 4)

ఈ సారి కాంచన సిరీస్‌లో స్పెషల్ అట్రాక్షన్ గా బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి జాయిన్ కావడం విశేషం. ఇది ఆమెకి కోలీవుడ్‌లో తొలి సినిమా. నోరా ఫతేహి కేవలం గ్లామర్ కోసమే కాకుండా, ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారని టాక్.

ఇంకా, ప్రముఖ హీరోయిన్లు పూజా హెగ్డే(Pooja hegde in Kanchana 4), రష్మిక మందన్నా(Reshmika in Kanchana 4) కూడా ఈ సినిమాలో భాగమవుతారని వార్తలు వస్తున్నాయి. అయితే రష్మిక విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

70 కోట్లతో భారీ బడ్జెట్ .. (Kanchana 4 Budget)

ఈసారి లారెన్స్ కాస్త పెద్ద ఎత్తులో ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుత సమాచారం ప్రకారం, "కాంచన 4"ని దాదాపు 70 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. అంతే కాకుండా, ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని చూస్తున్నారు. అంటే తెలుగు, తమిళం మాత్రమే కాకుండా, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా రిలీజ్ చేయనున్నారు.

Also Read: మిరాయ్ లో ప్రభాస్..! ఈ ట్విస్ట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదుగా

ఈసారి కాంచనలో కథలో కూడా మార్పులు చేశారని సమాచారం. పూజా హెగ్డే ఈ సినిమాలో బధిర యువతిగా (చెవులు వినిపించని పాత్రలో) కనిపించనుంది. నోరా ఫతేహి కూడా ఓ కీలక పాత్రలో కనిపిస్తుందని టాక్. లారెన్స్ కథను పాత పార్ట్‌లకు మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. కొత్త టెక్నాలజీ, గ్రాఫిక్స్, సౌండ్ ఎఫెక్ట్స్ తో సినిమా ప్రేక్షకులను థ్రిల్ చేసేలా తెరకెక్కిస్తున్నారు.

Also Read: 'లిటిల్ హార్ట్స్' మౌళికి అల్లు అర్జున్ స్పెషల్ విషెస్.. ఏమన్నారంటే..?

"కాంచన 4" లాంటి హారర్ సినిమాలకు క్రేజ్ ఎప్పటికీ తగ్గదు హారర్ ని ఇష్టపడే అభిమానులకు కాంచన సిరీస్ ఒక మంచి అనుభూతిని ఇస్తుంది. లారెన్స్ కాంచన సిరీస్‌తో తన సత్తా చాటినట్టు, ఈసారి కూడా "కాంచన 4"తో తన మార్క్ హారర్ చూపించనున్నాడు. నోరా, పూజా లాంటి స్టార్ హీరోయిన్లు సినిమాకి హైప్ తెస్తోంది. ఇక సినిమా ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే రిలీజ్‌ వరకూ వెయిట్ చేయాల్సిందే!

Advertisment
తాజా కథనాలు