MIRAI VFX: కార్తిక్ ఘట్టమనేని టెక్నికల్ బ్రిలియన్స్ అరాచకం ..ఈ విజువల్స్ చూస్తే గూస్ బంప్స్ అంతే!

తేజ సజ్జా - కార్తీక్ ఘట్టమేని కాంబోలో నేడు భారీ అంచనాలతో విడుదలైన 'మిరాయి' బాక్సాఫీస్ వద్ద అదరగొడుతుంది. ప్రీమియర్ షో నుంచే సూపర్ హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది.  200 కోట్లు 300 కోట్లు కాదు బయ్యా.. 60 కోట్లతో హాలీవుడ్ రేంజ!

New Update

MIRAI VFX:   తేజ సజ్జా - కార్తీక్ ఘట్టమేని కాంబోలో నేడు భారీ అంచనాలతో విడుదలైన 'మిరాయి' బాక్సాఫీస్ వద్ద అదరగొడుతుంది. ప్రీమియర్ షో నుంచే సూపర్ హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది.  అంచనాలకు తగ్గట్లే సినిమాలోని విజువల్స్, యాక్షన్ సీన్స్, వీఎఫెక్స్ నటీనటుల పర్ఫార్మెన్స్ ఆకట్టుకున్నాయి. సినిమా చూసిన ప్రతి ఒక్కరు  'మిరాయి' ఒక మంచి థియేటర్  ఎక్స్‌పీరియన్స్ అందిస్తుందని చెబుతున్నారు. మైథలాజికల్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిందని అంటున్నారు. ప్రేక్షకులు, విమర్శకులు, సినీ ప్రముఖుల, సినీ విశ్లేషకులు ఇలా సినిమా చూసిన ప్రతి ఒక్కరు మూవీ  అద్భుతమని కొనియాడుతున్నారు. స్మాల్ స్కెల్ బడ్జెట్ లో  హాలీవుడ్ రేంజ్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందించారని ప్రశంసలు కురిపిస్తున్నారు.

 టెక్నీకల్ బ్రిలియన్స్ 

ముఖ్యంగా ఈ సినిమాలోని వీఎఫెక్స్, సాంకేతిక అంశాల గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు.  డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని టెక్నీకల్ బ్రిలియన్స్ అద్భుతమని కొనియాడుతున్నారు.  రూ. 200 కోట్లు, రూ. 300 వందల కోట్లు కాదు కేవలం రూ. 60 కోట్ల బడ్జెట్ తో అద్భుతం సృష్టించారని అంటున్నారు. వందల కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమాల్లో కూడా ఈ రేంజ్ వీఎఫెక్స్ ఉండవని ఫిదా అవుతున్నారు ప్రేక్షకులు. సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా కూడా ఇదొక తక్కువ బడ్జెట్ ఫిల్మ్ అనే ఫీలింగ్ కలగదు! ప్రతీ ఫ్రేమ్‌లోనూ నాణ్యమైన వీఎఫెక్స్, స్పష్టత కనిపిస్తాయి.

ఈ సీన్స్ హైలైట్ 

కథలోని ఫాంటసీ ప్రపంచం, పౌరాణిక అంశాలను సృష్టించేందుకు ఉపయోగించిన వీఎఫెక్స్ లో ఎంతో క్వాలిటీ కనబరిచారు మేకర్స్.  సినిమాలో కొన్ని యాక్షన్ సీన్స్ , ఛేజింగ్ సీన్లు, పెద్ద పక్షి విజువల్స్ వంటి సన్నివేశాల్లో హాలీవుడ్ రేంజ్ వీఎఫెక్స్ ఉన్నాయని ప్రేక్షకులు అంటున్నారు. కథలోని పౌరాణిక అంశాలు, వాటికి సంబంధించిన పాత్రలను కూడా వీఎఫెక్స్ ద్వారా  అద్భుతంగా సృష్టించారు. కేవలం సాంకేతికతకు  మాత్రమే ప్రాధాన్యత ఇవ్వకుండా  కథలో  కూడా 'మిరాయ్' బలాన్ని ప్రదర్శించిందని ప్రశంసిస్తున్నారు.  యాక్షన్, వీఎఫ్ఎక్స్‌తో పాటు కథలోని ఎమోషన్ డివోషన్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మొత్తంగా స్మాల్ స్కెల్ బడ్జెట్ లో  హాలీవుడ్ రేంజ్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందించింది 'మిరాయ్'. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని డైరెక్టర్ కావడంతో పాటు సినిమాటోగ్రాఫర్ కూడా తానే అవ్వడం పెద్ద ప్లస్ పాయింట్ గా నిలిచింది. 

బడా సినిమాలకు దీటుగా 

ఇటీవలే కాలంలో వందల కోట్ల బడ్జెట్ తో నిర్మించిన సినిమాల్లో కూడా వీఎఫ్ఎక్స్ నాణ్యత విషయంలో విమర్శలు ఎదుర్కొన్నాయి. ఉదాహరణకు భారీ బడ్జెట్ తో తెరకెక్కిన  ఆదిపురుష్, హరిహరవీరమల్లు చిత్రాల వీఎఫెక్స్ నాసిరంకంగా ఉన్నాయంటూ ప్రేక్షకుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి.   ఇలాంటి సమయంలో చిన్న బడ్జెట్ తో నిర్మించిన  'మిరాయ్' ఇంత నాణ్యమైన అవుట్ పుట్ తో బయటికి రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది.  మొన్నటికి మొన్న యానిమేషన్ సీరీస్  'మహావతార్ నరసింహా' కూడా తక్కువ బడ్జెట్ లో ప్రేక్షకులకు అద్భుతమైన వీఎఫ్ఎక్స్, విజువల్ ఫీస్ట్ అందించింది. దీని తర్వాత ఇటీవలే విడుదలైన  'కొత్త లోక' ఈ సినిమాలో కూడా లిమిటెడ్ బడ్జెట్ తో మంచి విజువల్స్ అందించారు దర్శక నిర్మాతలు. దీని ప్రకారం కొన్ని సార్లు భారీ బడ్జెట్ లేకపోయినా మంచి విజన్, ప్లానింగ్ ఉంటే చేయవచ్చని అభిప్రాయపడుతున్నారు ప్రేక్షకులు. 

Advertisment
తాజా కథనాలు