/rtv/media/media_files/2025/09/12/kavitha-2025-09-12-20-46-40.jpg)
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. సింగరేణి ఎన్నికల్లో BRS అనుబంధ విభాగం TBGKSకు గెలిచేంత సీన్ లేదన్నారు. వాపును చూసి బలుపు అనుకుంటున్నారని తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్ తెలంగాణ జాగృతి కార్యాలయంలో హెచ్ఎంఎస్(HMS) – సింగరేణి జాగృతి సంయుక్త సమావేశం(ఏబీ సింగరేణి మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ కేంద్ర కార్యవర్గ సమావేశం) జరిగింది. ఈ కార్యక్రమంలో ఆమెమాట్లాడుతూ.. TBGKS మొన్నటి ఎన్నికల్లో పోటీనే చేయలేదన్న కవిత.. సింగరేణి ఎన్నికల్లో గెలిచేది HMS మాత్రమేనని చెప్పారు.
Also Read : Caste Income: గుడ్‌న్యూస్.. ఇక నుంచి క్యాస్ట్ ఇన్‌కమ్ సులభంగా పొందచ్చు
కార్మికుల చెమటకు విలువ తెచ్చేది – కవిత అక్క!
— Tejachowdhary (@Teja_khairtabad) September 12, 2025
సింగరేణి బిడ్డల భవిష్యత్తు కాపాడేది – HMS + కవిత అక్క!
కార్మికుల గర్వం, సింగరేణి గర్వం – మన కవిత అక్క!
ఒక్కటైన గళం – HMS + కార్మికులు + కవిత అక్క!
సింగరేణి బలమే – కార్మికుల ఐక్యత, కవిత అక్క నేతృత్వం!@RaoKavithapic.twitter.com/gwv2peD7TZ
Also Read: సీబీఐకి ఫిర్యాదు చేస్తా.. BRS పై ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
ఎందుకు పోరాటం చేయడం లేదు
HMS, జాగృతి కలిసి సింగరేణి కార్మికుల కోసం పని చేస్తాయని వెల్లడించారు. గతంలో కేసీఆర్ చెప్పారనే TBGKSకు ఓటు వేశారని, కార్మికుల సమస్యలపై TBGKS ఎందుకు పోరాటం చేయడం లేదని ఆమె ప్రశ్నించారు. కార్మికులకు పైసా ఖర్చు లేకుండా వైద్యం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. వారసత్వ ఉద్యోగాలను తగ్గించేందుకు కొత్త కొర్రీలు పెడుతున్నారని మండిపడ్డారు. పదో తరగతి పాస్ కాలేదంటూ 470 అప్లికేషన్స్ ఆపేశారని, చదువుతో సంబంధం లేకుండా వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. సింగరేణిలో జరుగుతున్న అవినీతిపై సీబీఐకి కంప్లైంట్ చేస్తామని ఆమె తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణిలో అవినీతి రాజ్యమేలుతోందని కవిత సంచలన ఆరోపణలు చేశారు.
Also Read : Anushka Shetty: కొంతకాలం కనిపించను.. అనుష్క షాకింగ్ నిర్ణయం! వైరలవుతున్న లెటర్
అవినీతిని కట్టడి చేయకుంటే సింగరేణి భవన్‌ను ముట్టడిస్తామని కవిత హెచ్చరించారు. కాంగ్రెస్ అంటేనే కరెప్షన్ పార్టీ అని విమర్శి్ంచిన ఆమె... సింగరేణిలో తీవ్రమైన అవినీతికి పాల్పడుతున్నారని అన్నారు. ప్రతి కాంట్రాక్ట్ లో 25 శాతం అవినీతి జరుగుతోందని, 10 శాతం వాటా కాంగ్రెస్ పెద్దలకు వెళ్తోందన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే తామే సీబీఐకీ, కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. కార్మికుల బాగు కోసం పనిచేస్తానని హామీ ఇస్తున్నానని కవిత అన్నారు.రాబోయే సింగరేణి ఎన్నికల్లో హెచ్ఎంఎస్ జెండా ఎగురబోతోందని ఆమె జోస్యం చెప్పారు. హెచ్ఎంఎస్ గౌరవాధ్యక్షురాలిగా తనను ఎన్నుకుని.. తనకు ఇచ్చిన గౌరవాన్ని కాపాడుకుంటూ కార్మికుల మంచి కోసం పనిచేస్తానని కవిత హామీ ఇచ్చారు.
Also Read : Faria Abdullah: దేవకన్యలా ముస్తాబైన ఫరియా.. ఫొటోలు చూస్తే.. వావ్ అనాల్సిందే!