/rtv/media/media_files/2025/09/12/anushka-shetty-2025-09-12-19-18-11.jpg)
Anushka Shetty
Anushka Shetty: ఈ మధ్య చాలా మంది సెలబ్రెటీలు డిజిటల్ డీటాక్స్ ట్రెండ్ ఫాలో అవుతున్నారు. అంతే కొద్ది రోజులపాటు సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పేసి వ్యక్తిగత జీవితం పై శ్రద్ధ పెట్టేందుకు టైం కేటాయిస్తున్నారు. ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ జేజమ్మ కూడా ఇదే ఫాలో అవుతున్నారు. కొంతకాలం సోషల్ మీడియాకు బ్రేక్ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఒక నోట్ ద్వారా స్వీటీ ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట ఫుల్ వైరల్ అవుతోంది.
నోట్ లో ఏముంది!
స్వీటీ తన నోట్ ఇలా రాసుకొచ్చారు.. కొంతకాలం సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని అనుకుంటున్నాను. ఎప్పుడూ స్క్రోలింగ్ చేసే జీవితానికి దూరంగా.. నిజమైన ప్రపంచానికి దగ్గరగా ఉండాలని నిర్ణయించుకున్నాను. త్వరలోనే మరిన్ని మంచి కథలతో మరింత ప్రేమతో మీ అందరి ముందుకు వస్తాను'' అంటూ తానే స్వయంగా రాసిన లెటర్ పోస్ట్ చేసింది. ఈ లెటర్ ప్రస్తుతం నెట్టింట ఫుల్ వైరల్ అవుతోంది. దీంతో అనుష్క ఇలాంటి డెషిషన్ ఎందుకు తీసుకున్నారు అని చర్చించుకుంటున్నారు ఫ్యాన్స్. అయితే అనుష్క కొద్దిరోజులుగా చిన్న హెల్త్ ఇష్యుస్ తో బాధపడుతున్నారని పలు కథనాల్లో వార్తలు వచ్చాయి. ఇటీవలే విడుదలైన 'ఘాటీ' మూవీ ప్రమోషన్లో పాల్గొనకపోవడానికి కూడా అదే కారణమని ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో నిజమెంత అనేది తెలియదు.
ఇదిలా ఉంటే.. ఇటీవలే ఘాటీ సినిమతో అలరించింది అనుష్క. డైరెక్టర్ క్రిష్ జాగర్ల మూడి దర్శకత్వంలో భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ప్లాప్ టాక్ మూట కట్టుకుంది. స్క్రీన్ ప్లే చాలా బ్యాడ్ గా ఉందని, కథలో బలం లేదని విమర్శలు వచ్చాయి.
గంజాయి స్మగిలింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో అనుష్క శీలావతి అనే పాత్రలో నటించారు. ఒక సాధారణ గిరిజిన మహిళగా ఉన్న అనుష్క స్మగిలింగ్ సామ్రాజ్యానికే రాణిగా ఎలా ఎదిగింది ? ఆమె స్మగ్లింగ్ వ్యాపారంలోకి అడుగుపెట్టిందెకు ప్రభావితం పరిస్థితుల్లో ఏంటి? అనే అంశాలను ఈ చిత్రంలో చూపించారు. అరుంధతి, రుద్రమదేవి వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్న అనుష్క 'ఘాటీ' తో మరో హిట్ తన ఖాతలో వేసుకుంటుందని ఫ్యాన్స్ ఆశించారు. కానీ, ఈ సినిమా ఊహించని విధంగా డిస్సపాయింట్ చేసింది.
'బహుబలి ' తర్వాత అనుష్క నుంచి కేవలం ఒక్క సినిమా మాత్రమే వచ్చింది. దీంతో స్వీటీ సినిమాల కోసం ఆసక్తిగా ఉన్నారు అభిమానులు. అనుష్క కూడా మంచి ప్రాజెక్ట్స్ తో త్వరలోనే మీ ముందుకు వస్తానని అభిమానులకు తెలియజేసింది.