BRS : తుమ్ముల, పొన్నం అసలు మీరు మనుషులేనా.. హీటెక్కిన జూబ్లీహిల్స్ ఫైట్!

మంత్రులు పొన్నం, తుమ్మల కామెంట్స్‌ పై బీఆర్ఎస్ కూడా స్ట్రాంగ్ గానే కౌంటర్ ఇచ్చింది. తుమ్మల నాగేశ్వరరావు అసలు మనిషేనా అంటూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

New Update
srinivas goud

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫైట్ మరింత రసవత్తరంగా మారింది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తన భర్త, దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ను  గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె  ప్రసంగిస్తుండగా ఓ సభలో ఉద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. గోపీనాథ్ ప్రజల కోసం చేసిన సేవ, నియోజకవర్గ అభివృద్ధికి ఆయన పడిన తపన గురించి మాట్లాడే క్రమంలో ఆమె భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

అయితే దీనిపై కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ సభలో మాట్లాడుతూ.. తమకు ప్రత్యర్థి, మా సోదరి సునీతను చూసి తాను జాలి పడుతున్నానని అన్నారు. ఆమె కన్నీళ్లు పెట్టుకుని సానుభూతి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. రాజకీల లబ్ధి కోసమే సునీతను ఓదార్చతున్నట్లుగా కేటీఆర్, హరీశ్‌రావులు కలిసి డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్దారు. రాజకీయాల కోసం సునీతను ఇబ్బంది పెట్టడం భావ్యం కాదన్నారు పొన్నం.  సునీతతో కన్నీరు పెట్టిస్తూ.. గులాబీ పార్టీ ఓట్లు దండుకోవాలని చూస్తోందని ఆరోపణలు గుప్పించారు.  మరోమంత్రి తుమ్ముల నాగేశ్వరావు మాట్లాడుతూ.. ఆడపిల్ల కన్నీళ్లను కూడా వదిలిపెట్టడం లేదు. వాటి ద్వారా మళ్లీ అధికారం పొంది..  రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబం దోచుకోవాలని చూస్తుందని ఆరోపించారు. 

మంత్రులు పొన్నం, తుమ్మల కామెంట్స్‌ పై బీఆర్ఎస్ కూడా స్ట్రాంగ్ గానే కౌంటర్ ఇచ్చింది. తుమ్మల నాగేశ్వరరావు అసలు మనిషేనా అంటూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తుమ్మల అసలు నీకు మానవత్వం ఉందా అని ప్రశ్నించారు. ప్రజల నుంచి వచ్చిన స్పందనతో మాగంటి సునీత కన్నీళ్లు పెట్టారని,  సునీత బిడ్డలు, కొడుకు ప్రచారం చేస్తే యాక్షన్ ఎట్లా అవుతుందని నిలదీశారు.

సునీతకు క్షమాపణ చెప్పాలి 

మంత్రులు పొన్నం, తుమ్మల వెంటనే మాగంటి సునీతకు క్షమాపణ చెప్పాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతుంటే పక్కనే మేయర్ ఉన్నారు.. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమె వెంటనే స్పందించాల్సి ఉండేదన్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చనిపోతే దేశ వ్యాప్తంగా రాజీవ్ గాంధీ ఫోటోలతో ప్రచారం చేయలేదా అని ప్రశ్నించారు. ఆడబిడ్డను మంత్రులు అవమానించారని, మంత్రుల భాషను మహిళలు వినాలన్నారు శ్రీనివాస్ గౌడ్.  

కాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నవంబర్ 11వ తేదీన జరగనుంది. 14వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఉప ఎన్నిక కోసం అధికారిక గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అక్టోబర్ 21 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అక్టోబర్ 24వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. నామినేషన్ పత్రాలను షేక్ పేట్ తాహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో స్వీకరిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు