కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచకుంటే తాము ఎన్నికలు జరగనివ్వబోమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ మేరకు రిజర్వేషన్లు పెంచిన తర్వాతే ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించడంపై ఆలోచన చేయాలన్నారు. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీల అమలు కోసం జనవరి 3న ఇందిరా పార్కు వద్ద భారీ సభను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. Also Read: స్వర్గంలో రతన్ టాటా, కలాం, శాస్త్రితో మన్మోహన్.. వైరల్ అవుతున్న AI ఫొటోలు! దాదాపు 40కిపైగా బీసీ కుల సంఘాలకు చెందిన నాయకులు శుక్రవారం ఎమ్మెల్సీ కవితతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బీసీల సమస్యలు, హామీల అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ... స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిండానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని, కానీ ప్రధాన డిమాండ్‌గా ఉన్న బీసీల రిజర్వేషన్ పెంపుపై స్పష్టత లేకుండా ఎన్నికలు జరిపేందుకు వీలు లేదన్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్‌లో చెప్పినట్లు గుర్తు చేశారు. రిజర్వేషన్లు పెంచకుంటే ఎన్నికలు జరగనివ్వబోమని తేల్చిచెప్పారు. Also Read: చైనా బిగ్ ప్లాన్.. బ్రహ్మపుత్ర నదిపై భారీ డ్యామ్‌కు ఏర్పాట్లు రాబోయే రోజుల్లో చేపట్టే జనగణనలో భాగంగా బీసీ కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కవిత డిమాండ్ చేశారు. బీసీలకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వాల వైఖరిని ఎండగడుతామన్నారు. అలాగే జనవరి 3న నిర్వహించబోయే సభకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరు కావాలని పిలుపునిచ్చారు. మరోవైపు బీసీల సంక్షేమం కోసం బీఆర్ఎస్ పార్టీ హాయంలో ప్రవేశపెట్టిన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేయడంపై ధ్వజమెత్తారు. ఈ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. Also Read: యూనివర్సిటీలో యువతిపై గ్యాంగ్‌రేప్.. కొరడాతో కొట్టుకున్న బీజేపీ స్టార్ లీడర్