TG News: తెలంగాణ రాజకీయాల్లో పదవుల పంచాయితీ.. పేలుతున్న మాటల తూటాలు!
తెలంగాణ రాజకీయాల్లో పదవుల పంచాయితీ పీక్స్‌కి చేరింది. నల్గొండ జిల్లా కాంగ్రెస్ నాయకుల మధ్య ఆధిపత్య పోరు ముదురుతోంది. జానారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య మాటల తూటలు పేలుతున్నాయి. జానారెడ్డిని ధృతరాష్ట్రుడితో పోల్చారు రాజగోపాల్ రెడ్డి.
TG News: తెలంగాణ రాజకీయాల్లో పదవుల పంచాయితీ పీక్స్‌కి చేరింది. టీకాంగ్రెస్‌లో నల్గొండ జిల్లా నాయకుల మధ్య ఆధిపత్య పోరు ముదురుతోంది. సీనియర్ నేత జానారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య మాటల తూటలు పేలుతున్నాయి. రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిని జానారెడ్డి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ జోరుగా చర్చ నడుస్తోంది. ఇంతకీ రాజగోపాల్ రెడ్డికి, జానారెడ్డికి మధ్య ఏం జరుగుతుందో తెలుసుకుందాం.
రాజగోపాల్ రెడ్డి వర్సెస్ జానారెడ్డి..
మంత్రివర్గ విస్తరణ లిస్ట్ అంటూ ప్రచారం జరగడంతో కాంగ్రెస్ లో విభేదాలు బయటపడ్డాయి. నల్గొండలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వర్సెస్ జానారెడ్డిగా మారింది. ఈ నేపథ్యంలో సొంత పార్టీ నేతలపైనే హాట్ కామెంట్స్ చేశారు రాజగోపాల్ రెడ్డి. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ నేత జానారెడ్డి ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారని ఆరోపించారు. తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుపుల్లలు వేస్తున్నారని విమర్శించారు. తనకు అధిష్ఠానం మంత్రి పదవి ఇస్తానంటే.. పార్టీలో కొందరు సీనియర్ నేతలకు చెమటలు పడుతున్నాయంటూ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశారు.
జానారెడ్డిపై రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. అసలు కోమటిరెడ్డికి మంత్రిపదవి రాకుండా అడ్డుకోవాల్సిన అవసరం జానారెడ్డికి ఏముందనే చర్చ మొదలైంది. పార్టీలో జానారెడ్డి సీనియర్ నేత. ఇదివరకు ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలు జానారెడ్డి కనుసన్నలోనే కొనసాగాయి. కానీ ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ చేతుల్లోకి వెళ్తున్నాయనే ప్రచారం ఊపందుకుంది.
మంత్రి పదవి రాకుండా జానారెడ్డి అడ్డు..
కోమటిరెడ్డి బ్రదర్స్‌లో ఇప్పటికే వెంకట్‌రెడ్డి మంత్రిగా ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అటు జానారెడ్డి ఇద్దరు కుమారులు ఒకరు ఎమ్మెల్యే, మరొకరు ఎంపీగా కొనసాగుతున్నారు. అయితే కేబినెట్ విస్తరణలో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే నల్గొండ కాంగ్రెస్ రాజకీయాలు పూర్తిగా కోమటిరెడ్డి బ్రదర్స్ చేతుల్లోకి వెళ్తాయని కాంగ్రెస్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కోమటిరెడ్డికి మంత్రి పదవి రాకుండా జానారెడ్డి అడ్డుపడుతున్నారని వాదనలు వినిపిస్తున్నాయి.
అయితే గతకొంతకాలంగా కేబినెట్ విస్తరణలో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఫిక్స్ అంటూ ప్రచారం జరుగుతోంది. రాజగోపాల్ రెడ్డి కూడా తనకు హోంమంత్రి పదవి ఇష్టమంటూ ఇటీవలే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే జానారెడ్డి అధిష్టానానికి లేఖ రాశారు. విస్తరణలో రంగారెడ్డి జిల్లాకు.. పార్టీ సీనియర్ నాయకులకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. అప్పటినుంచి జానారెడ్డి, రాజగోపాల్ రెడ్డి మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జానారెడ్డిపై సంచలన కామెంట్స్ చేశారు.
ఇక 16 నెలలుగా అప్పుడు.. ఇప్పుడు అంటూ మంత్రివర్గవిస్తరణ వాయిదా పడుతూ వస్తోంది. ఏప్రిల్ 3న కేబినెట్ విస్తరణ ఉంటుందని ఆశించినా.. అది జరగలేదు. మళ్లీ ఎప్పుడు ఉంటుందోనన్న క్లారిటీ కూడా లేకపోవడంపై ఆసక్తి నెలకొంది.
congress | komatireddy-rajagopal-reddy | telugu-news | today telugu news

Telangana congress

Also Read: ఫార్మా రంగంలో కూడా లేఆఫ్స్.. రూ.కోటిపైగా వేతనాలు ఉన్నవారు ఔట్
అయితే గతకొంతకాలంగా కేబినెట్ విస్తరణలో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఫిక్స్ అంటూ ప్రచారం జరుగుతోంది. రాజగోపాల్ రెడ్డి కూడా తనకు హోంమంత్రి పదవి ఇష్టమంటూ ఇటీవలే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే జానారెడ్డి అధిష్టానానికి లేఖ రాశారు. విస్తరణలో రంగారెడ్డి జిల్లాకు.. పార్టీ సీనియర్ నాయకులకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. అప్పటినుంచి జానారెడ్డి, రాజగోపాల్ రెడ్డి మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జానారెడ్డిపై సంచలన కామెంట్స్ చేశారు.
Also Read: బెంగాల్ చల్లబడటం లేదు..మళ్ళీ నిరసనలు, పోలీస్ వాహనానికి మంటలు..