/rtv/media/media_files/2025/04/14/qJuQMt25RulT2rV5kLgx.jpg)
Waqf Amendment Act
వక్ఫ్ సవరణ చట్టం బెంగాల్ ను అల్లకల్లోలం చేస్తోంది. నిరసనలతో రోజురోజుకూ ఆ రాష్ట్రం ఉద్రిక్తంగా మారుతోంది. సీఎం మమతా బెనర్జీ ఆ చట్టాన్ని అమలు చేయమని చెప్పారు. అయినా కూడా ఆందోళనలు ఆగడం లేదు. తాజాగా ఈరోజు మరోసారి అల్లర్లు చెలరేగాయి. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని భంగర్‌లో ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ మద్దతుదారులను వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా నిరననలు చేశారు. దీన్ని పోలీసులు అడ్డకోవడానికి ప్రయత్నించారు. దీంతో ఇరువురు మధ్య ఘర్షణ చటు చేసుకుంది. ఇందులో నిరసనకారులు పోలీసుల వాహనాన్ని తుగలబెట్టారు. అనేక మందికి గాయాలయ్యాయి. తాము ర్యాలీ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వలేదని , పగా లాఠీ ఛార్జి కూడా చేశారని నిరసనకాలు చెబుతున్నారు. దీంట్లో ఒక ఐఎస్ఎఫ్ కార్యకర్త తలకు బలమైన గాయమైందని తెలిపారు.
ఆమోదం పొందాక మొదలైన నిరసనలు..
వక్ఫ్ చట్టంపై వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌లో పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ముర్షిదాబాద్ జిల్లాలో నిరసనలు అధికం కావడంతో పరిస్థితులు తీవ్రంగా మారాయి. ఈ క్రమంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి దూరి చోరీ చేశారు. ఇంట్లో ఉన్న అన్ని వస్తువులను దోచుకున్న తర్వాత ఇద్దరిని కాల్చేసి వెళ్లిపోయారు. మరో వైపు సజూర్‌మోరె వద్ద 21 ఏళ్ల యువకుడు తుపాకీ కాల్పుల్లో గాయపడ్డాడు. ఈ యువకుడు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందాడు. వక్ఫ్ సవరణ చట్టం పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసనలు చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో శుక్రవారం నుంచి నిరసనలు జరుగుతున్నాయి. శనివారం రోజున మాల్డా, ముర్షిదాబాద్, సౌత్ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో రంగంలోకి దిగిన పోలీసులు 110 మందికి పైగా నిరసనాకారులను అరెస్టు చేశారు.
today-latest-news-in-telugu | waqf-act | west bengal
Also Read: PM Modi: తన అభిమానికి స్వయంగా చెప్పులు తొడిగిన ప్రధాని మోదీ