/rtv/media/media_files/2025/02/28/GuizfgHklqeF8d67HDAJ.jpg)
Minister Sridhar Babu
ఐటీశాఖ మంత్రి శ్రీధర్ బాబు (Sridar Babu) కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మహిళల కోసం మినీ ఇండస్ట్రియల్ పార్క్‌ను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఫిక్కి (FICCI) లో నిర్వహించిన తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఎస్సీ,ఎస్టీ ఎంటర్‌ప్రైజెస్ సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఇండస్ట్రియల్ పార్కుల్లో ఎస్సీ, ఎస్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు 10 శాతం ప్రత్యేకంగా కేటాయిస్తామని పేర్కొన్నారు. ''ఎస్సీ, ఎస్టీలు ఎదిగినప్పుడే సమాజంలో అభివృద్ధి జరుగుతుంది. దళితులకు చేవెళ్ల డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీని ప్రభుత్వం తప్పకుండా అమలు చేస్తుంది. ఒకవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతూనే మరోవైపు సంక్షేమం, అభివృద్ధి పట్ల దృష్టి సారించాం.
Also Read: తాగొచ్చి కొట్టేవాడు...ఇంటినుంచి గెంటేశాడు.. మానవ్ శర్మ భార్య సంచలన కామెంట్స్
Also Read : స్కూల్ విద్యార్థులకు అలర్ట్.. ఆ రోజు నుంచే ఏపీలో ఒంటిపూట బడులు
Minsiter Sridar Babu Says Mini Industrial Park
పారిశ్రామికవేత్తలకు రూ.4500 కోట్లకు పైగానే రాయితీగా అందాల్సిన బకాయిలు ఉన్నాయి. వీటిలో రూ.2,200 కోట్లు ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకే ఇవ్వాల్సి ఉంది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ చెల్లింపులను పరిగణలోకి తీసుకున్నాం. మార్చిలో రూ.300 కోట్లు చెల్లిస్తాం. ఎక్కువ మంది కార్మికులకు ఉపాధి అందిచేలా MSME ప్రత్యేక పాలసీని తీసుకొచ్చాం. స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేసి పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యమున్న మానవ వనరులు అందిస్తాం.
Also Read: ఈశా ఫౌండేషన్‌కు బిగ్ రిలీఫ్.. సుప్రీంకోర్టు కీలక ఆదేశం
Also Read : Vigyan Vaibhav - 2025: సైన్స్ అండ్ టెక్నాలజీలో భారత్‌ను లీడర్‌గా నిలిపేందుకే "విజ్ఞాన్ వైభవ్'
కొత్త ఆలోచనలతో ముందుకొచ్చే వాళ్లకోసం ప్రభుత్వం అండగా ఉంటుంది. లోన్లు పొందడంలో SC,ST పారిశ్రామికవేత్తలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు పరిష్కరిస్తాం. తమిళనాడు, కర్ణాటకలో ఈ విధానాలను పరిశీలించేందుకు ఓ కమిటీని కూడా ఏర్పాటు చేస్తాం. స్పెషల్ టీం ఇచ్చే నివేదిక ఆధారంగా దళిత పారిశ్రామికవేత్తలకు మరింత ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకుంటామని'' శ్రీధర్ బాబు అన్నారు.